టాలీవుడ్, బాలీవుడ్( Tollywood, Bollywood ) ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో రష్మిక ఒకరు.వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ కెరీర్ పరంగా ఈ బ్యూటీ బిజీగా ఉన్నారు.
అయితే తాను సక్సెస్ కోసం ఒక విషయంలో రాజీ పడ్డానని రష్మిక వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.తాజాగా ఛావా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన రష్మిక ఈ కామెంట్లు చేశారు.
తాను ఫ్యామిలీకి ఎక్కువగా సమయాన్ని కేటాయించలేకపోతున్నానని ఈ విషయంలో తాను బాధ పడుతున్నానని రష్మిక ( Rashmika )అన్నారు.నా కెరీర్ విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం సంతోషంగా ఉన్నారని రష్మిక చెప్పుకొచ్చారు.
సక్సెస్ కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుందని అదే సమయంలో కొన్ని విషయాలను సంబంధించి రాజీ పడాల్సి ఉంటుందని రష్మిక వెల్లడించడం గమనార్హం.

కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపలేకపోయానని ఆమె తెలిపారు.ఈ ప్రయాణంలో నేను రాజీ పడిన అతి పెద్ద విషయం ఇదేనని రష్మిక పేర్కొన్నారు.వ్యక్తిగత విషయాలను, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి సమయం కేటాయించడం సులువైన విషయం కాదని రష్మిక కామెంట్లు చేశారు.
ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

నేను కెరీర్ లో అడుగుపెట్టిన సమయంలో మా అమ్మ చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుందని రష్మిక తెలిపారు.వృత్తిపరమైన కమిట్మెంట్స్ ను నిలబెట్టుకోవడానికి కుటుంబ సమయాన్ని త్యాగం చేయాల్సి ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చారు.ఫ్యామిలీ నా బలం అని కీలక సమయాలను కుటుంబంతోనే గడుపుతానని రష్మిక కామెంట్లు చేశారు.
నా చెల్లి చాలా స్మార్ట్ అని తనంటే నాకెంతో ఇష్టం అని రష్మిక పేర్కొన్నారు.