ముఖం మొత్తం మచ్చలేనా.. ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే నెల రోజుల్లో అన్ని మాయం!

సాధారణంగా కొందరి ముఖం ఎలాంటి మచ్చ లేకుండా అందంగా మెరిసిపోతూ ఉంటుంది.కానీ కొందరికి మాత్రం ముఖం మొత్తం మచ్చలే ఉంటాయి.

 Super Powerful Home Remedy For Getting Spotless Skin! Home Remedy, Spotless Skin-TeluguStop.com

ఇలాంటివారు తీవ్ర మానసిక వేద‌న‌కు గురవుతుంటారు.ముఖం మొత్తం ఏర్పడిన మచ్చలను వదిలించుకునేందుకు ఎన్నెన్నో ఖరీదైన క్రీమ్, సీరం తదితర ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను మీరు పాటించాల్సిందే.
div class=”middlecontentimg”>

Telugu Tips, Blemishes, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Spotless Skin

ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే నెల రోజుల్లో మచ్చలన్నీ మాయం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder), వన్ టేబుల్ స్పూన్ షుగ‌ర్ పౌడర్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) తో పాటు సరిపడా పచ్చి పాలు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
div class=”middlecontentimg”>

Telugu Tips, Blemishes, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Spotless Skin

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.చర్మం పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.కొద్ది రోజుల్లోనే మచ్చలేని మెరిసే చర్మం( Spotless skin ) మీ సొంతం అవుతుంది.

అలాగే ఈ సింపుల్ రెమెడీ మీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.మొటిమలకు అడ్డుకట్ట వేస్తుంది.స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ హోమ్ రెమెడీ గ్రేట్ గా సహాయపడుతుంది.మరియు చ‌ర్మాన్ని టైట్ గా బ్రైట్ గా సైతం మారుస్తుంది.

కాబట్టి మచ్చల సమస్యతో బాధపడుతున్న వారు మాత్ర‌మే కాదు అంద‌మైన మెరిసే ముఖ చ‌ర్మాన్ని కోరుకునే వారు కూడా తప్పకుండా సింపుల్ చిట్కాను పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube