కంటి ఆరోగ్యానికి అండగా నిలిచే ఈ ఐదు ఆహారాలను మీరు తీసుకుంటున్నారా?

ఇటీవల కాలంలో స్కూలుకు వెళ్లే పిల్లల్లో సైతం కంటి సమస్యలు( Eye problems ) తలెత్తుతున్నాయి.ముఖ్యంగా కంటి చూపు మందగించడం అనేది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య.

 These 5 Types Of Foods Are Very Healthy To Eyes! Eyes, Eyes Health, Best Foods,-TeluguStop.com

కళ్ళు మసకబారడం వల్ల కళ్లద్దాలపై ఆధారపడుతున్నారు.అందుకే కంటి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు కంటి ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.మరి వాటిలో టాప్ – 5 ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రోకలీ( Broccoli ).కంటి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో ఒకటి.బ్రోకలీలో బీటా కెరోటిన్, విటమిన్ బి 12, విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.ఇవి కంటి చూపును పెంచుతాయి.అలాగే బ్లూ బెర్రీస్( Blue berries ) ను తరచూ తీసుకుంటూ ఉండాలి.బ్లూ బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి అలసటను దూరం చేస్తాయి.

దృష్టిని మెరుగు పరుస్తాయి.

Telugu Foods, Broccoli, Carrot, Dark Chocolate, Eye Care, Eyes, Tips, Latest, Sa

కంటి ఆరోగ్యానికి అండగా నిలిచే ఆహారాల్లో డార్క్ చాక్లెట్( Dark chocolate ) ఒకటి.చాక్లెట్ ప్రియులకు నిజంగా ఇది శుభవార్త లాగానే ఉంటుంది.డార్క్ చాక్లెట్ రెటీనా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

తద్వారా కంటి చూపు పెరుగుతుంది.అయితే మంచిది అన్నారు కదా అని అతిగా తింటే మాత్రం లేనిపోని సమస్యలు తలెత్తుతాయి.

మితంగా డార్క్ చాక్లెట్ ను తీసుకోండి.పైగా డార్క్ చాక్లెట్ వల్ల ఒత్తిడి డిప్రెషన్ వంటి మానసిక సమస్యల సైతం దూరం అవుతాయి.

Telugu Foods, Broccoli, Carrot, Dark Chocolate, Eye Care, Eyes, Tips, Latest, Sa

అలాగే సాల్మన్ చేపలు( Salmon fish ) కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.అందువల్ల సాల్మన్ చేపలను తింటే కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.చూపు రెట్టింపు అవుతుంది.ఇక క్యారెట్ కూడా కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటిశుక్లం మరియు ఇతర కంటి పరిస్థితులను నివారించడంలో సహాయపడతాయి.

మ‌రియు దృష్టి మెరుగుప‌డేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube