టాలీవుడ్ ఇండస్ట్రీలోని హిట్ డైరెక్టర్లలో దర్శకుడు వెంకీ కుడుముల( Director Venky Kudumula ) కూడా ఒకరు.మరికొన్ని గంటల్లో ఈ దర్శకుడు రాబిన్ హుడ్( Robinhood ) సినిమాతో లక్ పరీక్షించుకోనున్నారు.
గత ఐదేళ్లూ నేను ఫెయిల్యూర్ నే అంటూ ఈ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవికి నేను వీరాభిమానినని ఆయన కామెంట్లు చేశారు.
చిరంజీవి( Chiranjeevi ) వల్లే నేను సినిమాల్లోకి వచ్చానని లైఫ్ లో ఒక్కసారైనా చిరంజీవితో కలిసి ఫోటో దిగాలని అనుకునేవాడినని ఆయన పేర్కొన్నారు.భీష్మ తర్వాత చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఎంతో సంతోషించానని వెంకీ కుడుముల తెలిపారు.
ఒక కథ రాసుకుని ఆ కథ చిరంజీవికి చెప్పానని అయితే ఆ కథ చిరంజీవికి నచ్చలేదని వెంకీ కుడుముల అన్నారు.వెంకీ మరో కథ రాయి తప్పకుండా చేసేద్దామని చిరంజీవి చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత నాకు అంత మంచి ఆలోచన రాలేదని అందువల్ల నాలో ఉన్న ఒక అభిమాని ఎంతో బాధ పడ్డాడని వెంకీ కుడుముల చెప్పుకొచ్చారు.చిరంజీవితో సినిమా చేస్తే ఆ సినిమా వేరే లెవెల్ లో ఉండాలని ఫిక్స్ అయ్యానని వెంకీ కుడుముల వెల్లడించారు.వేరే సినిమా చేసి వస్తానని చిరంజీవికి చెప్పానని ఆయన కూడా అంగీకరించారని వెంకీ కుడుముల కామెంట్లు చేశారు.

గత ఐదేళ్లు నేనొక ఫెయిల్యూర్ నే అని లైఫ్ లో అనుకున్నవి సాధించలేకపోయానని ఆయన తెలిపారు.ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలనుకుంటే వద్దని ఆపానని వెంకీ కుడుముల వెల్లడించారు.ఇన్నేళ్ల విరామం తర్వాత వస్తున్న సమయంలో రాబిన్ హుడ్ కెరీర్ కు ఎంతో ముఖ్యమని వెంకీ కుడుముల చెప్పుకొచ్చారు.
రాబిన్ హుడ్ సినిమా వెంకీ కుడుములకు హ్యాట్రిక్ అందిస్తుందేమో చూడాల్సి ఉంది.