మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కువ శాతం రీమేక్ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే.ఇలా రీమేక్ చేసిన సినిమాలలో గాడ్ ఫాదర్( God Father ) చిత్రం ఒకటి.
ఈ సినిమా మలయాళ నటుడు మోహన్ లాల్( Mohanlal ) హీరో గా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్( Lucifer Movie ) కి ఇది రీమేక్ చిత్రం కావటం విశేషం అయితే మలయాళంలో లూసిఫర్ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోగా తెలుగులో మాత్రం గాడ్ ఫాదర్ సినిమా యావరేజ్ గా నిలిచింది.

గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ పూర్తిగా మార్పులు చేశారు.అందుకే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అయితే మలయాళంలో లూసిఫర్ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని చేశారు.
ఎల్ 2: ఎంపురాన్’( L2: Empuraan ) అనే చిత్రంగా తెరకెక్కింది.ఈ సినిమా ఈనెల 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలుగులో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఇందులో భాగంగా నటుడు మోహన్ లాల్ కి గాడ్ ఫాదర్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయా అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు మోహన్లాల్ సమాధానం చెబుతూ తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాని తాను చూసానని తెలిపారు.అయితే ఒరిజినల్ సినిమాకు రీమేక్ సినిమాకు చాలా మార్పులు చేశారు.ముఖ్యంగా సెకండ్ హాఫ్ లూసిఫర్ సినిమాతో పోలికలు లేవు.లూసిఫర్ లో ఉన్న క్యారెక్టర్స్ ని చాలా వరకు మార్చేశారు.కాబట్టి ఈ సీక్వెల్ చిరంజీవి గారికి ఉపయోగపడకపోవచ్చు అంటూ మోహన్ లాల్ సమాధానం చెప్పారు.బహిరంగంగా చిరంజీవి గారికి ఈ సినిమా సూట్ అవ్వదని చెప్పడం తో సోషల్ మీడియాలో మోహన్ లాల్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.