టాలీవుడ్ హీరో నితిన్( Nithin ) హీరోగా నటించిన తాజా చిత్రం రాబిన్ హుడ్.( Robinhood ) ఇందులో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
వెంకీ కుడుముల( Venky Kudumula ) దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.అలాగే ఇందులో రాజేంద్ర ప్రసాద్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథి పాత్రలలో నటించిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ కుడుముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ.
భీష్మ సినిమా తర్వాత చిరంజీవి( Chiranjeevi ) కోసం ఒక కథ అనుకున్నాను.ఆయనకు ఫస్ట్ ఐడియా చెప్పితే చాలా ఎక్సైట్ అయ్యారు.
స్టోరీ, స్క్రీన్‌ప్లే డెవలప్‌మెంట్ కి చాలా సమయం తీసుకుని చేశాను.అయితే ఆయనను సంతృప్తిపరచలేకపోయాను.
మేము అనుకున్నలాగా అది అవ్వలేదు.మరో కథతో వస్తానని చెప్పాను.
తర్వాత మైత్రి మూవీ మేకర్స్ అధినేతలకు రాబిన్ హుడ్ ఐడియా చెప్పడం, వారి అంగీకారం లభించడం జరిగింది.భీష్మ సినిమాతో నితిన్ తో కంఫర్టబుల్ జర్నీ వచ్చింది.
రాబిన్ హుడ్ జర్నీ కూడా వండర్ఫుల్ గా సాగింది.

రాబిన్ హుడ్ మూవీలో హీరో మానిప్యులేటర్. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ స్ట్రాంగ్ అని నమ్మే వ్యక్తి.సినిమాలో ఫస్ట్ 20 నిమిషాలు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం రకరకాల గెటప్స్ అలరిస్తాయి.20 నిమిషాల తర్వాత కథ పూర్తిగా మారిపోతుంది.చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
ఈ సినిమా నితిన్ కెరీర్ లోనూ, నా కెరీర్ లోనూ బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది.సినిమా మొత్తం రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఫన్ ఉంటుంది.
ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఎంటర్టైనర్ ఇది అని చెప్పుకొచ్చారు వెంకీ కుడుముల.ఒక క్యామియో రోల్ ఇంటర్నేషనల్ స్టార్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను.

వార్నర్‌ని( Warner ) ఢిల్లీలో కలిసి ప్రెజెంటేషన్ ఇచ్చాను.ఆయన కూడా చాలా ఎక్సైట్ అయ్యారు.ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) ది చాలా ఇంపార్టెంట్ రోల్.ఆయన సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతుంటారు.హీరో ఆయన్ని మానిప్యులేట్ చేసి ఒక సీరియస్ వరల్డ్ లోకి తీసుకెళ్తాడు.ఆయన అమాయకంగా అందులో ఇరుక్కుపోతాడు.
ఈ క్యారెక్టర్ రాసినప్పటి నుంచి ఆయననే ఊహించుకున్నాను.టాలెంట్ ఉండడం వేరు.
టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు.ఇందులో శ్రీలీల క్యారెక్టర్ రెండో టైపు.
తనను చాలా ఇంటెలెక్చువల్ అనుకునే అమ్మాయి.చాలా ఫన్నీగా ఉంటుంది.
ఆ క్యారెక్టర్‌లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలిపారు.