చిరంజీవి.తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రనటుడు.ఇప్పటికీ నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నాడు.పాత తరం హీరోలతో పాటూ కొనసాగుతూ.ఇప్పటి హీరోలతో సమానంగా ముందుకు సాగుతున్నాడు.ఇప్పటికీ అద్భుత సినిమాలతో బిజీ బిజీగా కెరీర్ లీడ్ చేస్తున్నాడు.
పదేండ్ల పాటు రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి.ఆ తర్వాత ఖైదీ నెం150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.
తనలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు.ఒకప్పుడు ఎన్నో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన చిరంజీవి.
ఇంద్ర సినిమాతో కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు.
చిరంజీవి హీరోగా అద్భుత హిట్ కొట్టిన సినిమా ఇంద్ర.
బాక్సాఫీస్ రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టింది.ఎన్నో సంచలనాలను నమోదు చేసింది.
చిరంజీవి, ఆర్తి అగర్వాల్, సోనాలీ బింద్రే జంటగా నటించిన ఈ మూవీ.పలు సెంటర్లలో 175 రోజుల పాటు ఆడి అదుర్స్ అనిపించింది.
ఈ సినిమా 175 రోజుల వేడుక విజయవాడలో అంగరంగ వైభవంగా జరిగింది.ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకు హాజరయ్యారు.
కొన్ని లక్షల మంది అభిమానులు చిరంజీవిని చూసేందుకు తరలి వచ్చారు.ఇసుకేస్తే రాలనంత మందితో వేడుక ప్రాంగణం నిలిచిపోయింది.

అటు ఈ సందర్భంగా ఇంద్ర సినిమాకు పని చేసిన పలువురికి ప్రశంసా పత్రాలు, ఫీల్డులు అందించారు.వీటిని తీసుకునేందుకు చాలా మంది క్యూ కట్టారు.వరుసగా ఒక్కొక్కరిని స్టేజి మీదకు పిలుస్తూ.ప్రశంసా పత్రాలు, షీల్డులు అందిస్తున్నారు.అయితే ఇంతలో చిరంజీవి నటుడు సమీర్ ను పిలిచాడు.క్యూలో ఉన్న ఓ చెక్స్ షర్ట్ వ్యక్తిని లైన్ నుంచి పక్కకు లాగాలని చెప్పాడు.
వెంటనే పోలీసులకు చెప్పిన తనను లాగేశారు.అయితే ఎందుకు తనను లాగమన్నారని ఫంక్షన్ అయ్యాక చిరంజీవిని అడిగాడు సమీర్.
అయితే తను ఐదారు సార్లు షీల్డు తీసుకుని.మళ్లీ మళ్లీ వస్తున్నాడని చెప్పాడు.
అందుకే తనను లైన్ నుంచి పక్కకు తప్పించాలని చెప్పినట్లు వెల్లడించాడు.దీన్ని బట్టి చిరంజీవి ప్రతి వ్యక్తిని ఎంతగా అబ్జర్వ్ చేస్తాడో అర్థం చేసుకోవచ్చన్నాడు సమీర్.