ఒకసారి డబ్బు పై ప్రేమ ఉంటె, మరో సరి జీవితం పై లేదంటే భర్త పై, మరి కాదంటే పిల్లల పై ప్రేమ ఉంటుంది.అది ఆయా సందర్భాల్లో ఆయా ప్రాధాన్యతలను బట్టి మారుతుంది.
ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే నటి మరియు ప్రొడ్యూసర్ అయినా ప్రియా రామన్ జీవితంలో కూడా ఇలాంటి అనేక దశలు ఉండటమే.నటి ప్రియా రామన్ రజినీకాంత్ తొలిసారి ప్రొడ్యూసర్ గా మారి తీసిన వల్లి ద్వారా హీరోయిన్ గా మారింది.
ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది.ఇక ఒక తమిళ సినిమా షూటింగ్ లొకేషన్ లో తన తోటి నటుడు అయినా రంజిత్ తో ప్రేమలో పడింది.
ఆ ప్రేమ కాస్త పెళ్లిగా కూడా మారింది.1999 లో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వగా వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.అయితే ప్రియా రామన్ సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి రెండు చేతుల సంపాదించింది.ఇక సీరియల్ లో కూడా నటిస్తూ, హోస్ట్ గ, జడ్జి గా అన్ని రంగాల్లో రాణించింది.
అయితే ఆమె భర్త రంజిత్ మాత్రం బిజీ ఆర్టిస్ట్ కాకపోవడం తో ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించాడు.కానీ ఆ చిత్రాలు ఫ్లాప్ కావడం తో కోట్లాది రూపాయలు లాస్ వచ్చింది.
దాంతో ప్రియా రామన్ మరియు రంజిత్ మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఆ తర్వాత 2012 లో ఈ జంట విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు.కానీ ప్రేమ ఉన్న చోట గొడవలకు స్థానం ఉండదు.రంజిత్ మరియు ప్రియా లు డబ్బు విషయంలో గొడవలు పడి విడిపోయిన కూడా ఒక ఏడేళ్ల ఎడబాటు తర్వాత మళ్లి కలిసి తమ ప్రేమకు సాటి లేదు అని నిరూపించుకున్నారు.
ఇక ఈ మధ్య కాలంలో వీరి మళ్లి పెళ్లి చేసుకొని కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లో విడిపోవడాలు మాత్రమే ఉంటాయి.
మళ్లి కలవడం జరగదు.కానీ ఈ జంట విడిపోయిన ఇన్నేళ్లకు మళ్లి కలవడం పట్ల అంత సంతోషం వ్యక్తం చేసారు.