ఫరియా అబ్దుల్లా.( Faria Abdullah ) ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేసి సినిమా జాతి రత్నాలు.
( Jathi Ratnalu ) కాగా చాలామంది ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ జాతి రత్నాలు బ్యూటీ చిట్టి అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.ఈ సినిమాతో ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా.
సినిమాకు ముందు సినిమా తర్వాత కొద్ది రోజులపాటు ఎక్కడ చూసినా కూడా ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మారుమోగిపోయింది.ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.
కానీ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈమెకు అవకాశాలు రాలేదు.

జాతి రత్నాలు తరువాత ఆమెకు అవకాశాలు రావడానికి చాలా కాలం పట్టింది.అలా రవితేజతో కలిసి రావణాసుర చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.
తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఫరియా అబ్దుల్లా అల్లరి నరేష్ తో కలసి ఆ ఒక్కటీ అడగొద్దు సినిమాలో నటించింది.ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయింది.
దాంతో టాలీవుడ్ ని పక్కన పెట్టిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌పై దృష్టి సారించింది.అక్కడ విజయ్ ఆంటోనికి జంటగా వళ్లి మయిల్ చిత్రంలో నటించే అవకాశం వరించింది.
ఈ చిత్రం విడుదల కాకముందే ఈ అమ్మడిని మరో లక్కీచాన్స్ వరించిందన్నది తాజా సమాచారం.

విజయ్( Vijay ) వారసుడు జసన్ సంజయ్( Jason Sanjay ) మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే.ఈయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్( Vishnu Vishal ) కథానాయకుడిగా నటిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారు అన్న విషయం పై ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే.
అయితే మొత్తానికి ఫరియా అబ్దుల్లాకి అవకాశం దక్కిందని తెలుస్తోంది.కాగా తొలి చిత్రం విడుదలకు ముందే మరో అవకాశం వరించడం ఫరియా అదృష్టమేనని చెప్పాలి.
ఈమె నటిస్తున్న వళ్లి మయిల్, తాజాగా విష్ణు విశాల్ కు జంటగా నటిస్తున్న చిత్రాలు కోలీవుడ్ లో ఎలాంటి పేరు తెచ్చిపెడతాయో చూడాలి మరి.