ఈ రోజుల్లో పెళ్లిళ్ల తీరే మారిపోయింది.ఒకప్పుడు జీలకర్ర బెల్లం, ఏడడుగులు, ఇలా సంప్రదాయాలతో సింపుల్‌గా అయ్యేవి.
కానీ ఇప్పుడు ఆడంబరం, లగ్జరీ, స్టైల్ ఓ రేంజ్‌లో ఉంటున్నాయి.సోషల్ మీడియా పుణ్యమా అని, డెకరేషన్ దగ్గర నుంచి పెళ్లిలో జరిగే ఫన్నీ సంఘటనల వరకు అన్నీ క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.
తాజాగా, ఇలాంటి ఓ పెళ్లిలో( Wedding ) జరిగిన చిన్న పొరపాటు ఒకటి ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
ఈ వైరల్ వీడియోలో,( Viral Video ) పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఎంతో ముఖ్యమైన వరమాల (దండలు మార్చుకోవడం) కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారు.
అయితే, ఎవరో ఒకరు దండలు( Garlands ) తీసుకురావడం కాకుండా, టెక్నాలజీని వాడి, ఏకంగా డ్రోన్‌తో( Drone ) దండలు తెప్పించుకోవాలని డిసైడ్ అయ్యారు.ఆ డ్రోన్ మెల్లగా పెళ్లికొడుకు వైపు వస్తుండగా, అతను ఎంతో ఆత్రంగా దండను అందుకునే ప్రయత్నం చేశాడు.
కానీ, పాపం.అనుకున్నది ఒకటి, అయింది ఇంకొకటి.ఆ డ్రోన్ ఒక్కసారిగా అదుపుతప్పి గింగిరాలు తిరిగి టపాల్న కిందపడిపోయింది.ఈ సీన్ చూసి షాకైన పెళ్లి కొడుకు, కాస్త తేరుకుని నవ్వుతూనే ‘ఏంట్రా ఇది?’ అన్నట్లు డ్రోన్ ఆపరేటర్ వైపు ఓ లుక్కేశాడు.దండ సంగతి పక్కనపెట్టి, కిందపడ్డ డ్రోన్ గురించే ఎక్కువ కంగారు పడుతున్నట్లు కనిపించాడు.ఈ తతంగమంతా కెమెరాలో రికార్డవడంతో, పెళ్లికి వచ్చినవాళ్లంతా పగలబడి నవ్వారు.
ఈ వీడియోను ravi_arya_88 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్‌గా మారింది.ఇప్పటివరకు దాదాపు 30 లక్షల (3 మిలియన్) వ్యూస్ వచ్చేశాయి.వేలకొద్దీ ఫన్నీ కామెంట్లు కురుస్తున్నాయి.
ఓ యూజర్ సరదాగా, ‘పెళ్లి ఏమో మోడ్రన్‌గా ప్లాన్ చేశారు.
కానీ డ్రోన్ వచ్చి సీన్ మొత్తం నాశనం చేసిందిగా” అని కామెంట్ పెట్టాడు.ఇంకొకరు, ‘మా కాలంలో డ్రోన్లు కూడా పెళ్లిళ్లలో పడిపోతాయా గురూ’ అంటూ నవ్వేశారు.
మరొకరు, ‘అందుకే.సంప్రదాయాల విషయంలో ఈ మెషీన్లను అస్సలు నమ్మకూడదు భయ్యా’ అని రాశారు.
మొత్తానికి, ఈ వీడియో నెటిజన్లను ఎంటర్‌టైన్ చేస్తోంది.దీన్ని మీరు చూసేయండి.