OP Nayyar Lata Mangeshkar: ఆమె ఇండియన్ నైటింగేల్… కానీ అతను అమెచే ఒక్క పాట కూడా పాడించలేదు?

అతని పాటల కంపోజిషన్ త్రీ జనరేషన్స్ ను ఓలలాడించింది.70కు పైగా సినిమాల్లో 500కు పైగా పాటలకు ట్యూన్స్ కట్టిన సంగీత దర్శక దిగ్గజం ఓపీ నయ్యర్.( OP Nayyar ) మరోవైపు దశాబ్దాల కాలం పాటు హిందీ భారతీయ భాషలన్నింటిలో పాడి.హిందీ సినిమాను శాసించిన గాత్రం లతా మంగేష్కర్.( Lata Mangeshkar ) ఈ క్రమంలో ఆమె ఇండియన్ నైటింగేల్ గా అవతరించింది.అయితే వీరిద్దరూ సంగీతం విషయంలో ఎక్కడా ఒకరికొకరు తారసపడకపోవడం కొసమెరుపు.

 Op Nayyar And Lathaji Relation-TeluguStop.com

అవును, ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వం వహించిన ఏ సినిమాలోనూ… లతాజీ పాట లేకపోవడం ఒకింత ఆశ్చర్యకరం.

అవును, ఎందుకిలా జరిగింది? సంగీతంలో ఎటువంటి శిక్షణా తీసుకోకపోయినా.అద్భుతమైన బాణీలను అలవోకగా కట్టి మన్ననలందుకున్నారు ఓపీ నయ్యర్.ఆయనే కాదు, ఆయన ఇంట్లో కూడా ఎవ్వరూ సంగీతంతో అటాచ్ మెంట్ ఉన్నవాళ్లు లేరు.లాయర్లు, డాక్టర్ల కుటుంబమది.కానీ సంగీత సరస్వతి అతగాడిని వరించింది.

ఆయన మొదటగా ఆర్ పార్,( Aar Paar ) మిస్టర్ అండ్ మిసెస్ 55,( Mr and Mrs 55 ) సీఐడీ( CID ) సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేయగా అవి కాస్త బ్లాక్ బస్టర్స్ గా సంచలనం సృస్టించాయి.

Telugu Aar Paar, Asha Bhonsle, Lata Mangeshkar, Lathaji, Music Op Nayyar, Op Nay

ఆ తర్వాత నౌషాద్, రోషన్, శంకర్ జైకిషన్, మదన్ మోహన్ వంటివారిని తట్టుకుని చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవడం వంటి ఓపీ నయ్యర్ హిస్టరీ చాలామందికి తెలిసిందే.ఇకపోతే నయ్యర్ ఆస్థాన గాయకుల్లో మహ్మద్ రఫీ, గీతాదత్, శంషాద్ బేగం, ఆశాభోంస్లేల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి.అయితే, లత చెల్లెలైన ఆశాభోంస్లేతో( Asha Bhonsle ) ఎన్నో పాటలు పాడించిన ఓపీ నయ్యర్ గానకొకిలగా యావత్ దేశం గుర్తించిన లతాజీతో మాత్రం ఎందుకు పాడించలేదన్నదే ఇప్పటికీ అంతుపట్టలేని ఓ ప్రశ్న.

ఈ ప్రశ్నలు చాలాసార్లు లత, ఓపీ నయ్యర్ ఇద్దరికీ ఎదురయ్యాయి.

Telugu Aar Paar, Asha Bhonsle, Lata Mangeshkar, Lathaji, Music Op Nayyar, Op Nay

ఈ క్రమంలో ఓపీ నయ్యర్ ను పలువురు పలుమార్లు అడిగిన ప్రతీసారీ, లతాజీ చాలా అద్భుతమైన గాయని అని చెబుతూ.తన ట్యూన్స్ కు తాననుకున్న విధంగా ఆమె గొంతు ఎప్పుడు నప్పుతుందో అని నేను కూడా ఎదురు చూస్తున్నానని చెబుతుండేవారట నయ్యర్.ఇటువంటి ప్రశ్నలు లతాజీకి ఎదురైనపుడు తనకెప్పుడూ ఓపీ నయ్యర్ నుంచి పాట కోసం కాల్ రాలేదని చెప్పుకొచ్చేవారని.

అంతకుమించి తనకు తెలియదని సున్నితంగా విషయాన్ని దాటవేసేవారట!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube