శివ పంచాక్షరి, నారాయణ, మహా మృత్యుంజయ వంటి మంత్రాలను గురు ఉపదేశం లేకుండా పఠించ వద్దని మన పెద్దలు చెబుతుంటారు.అయితే ఇందులో నిజం ఎంత ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శివ పంచాక్షరి వంటి మంత్రాలను గురు ఉపదేశం ద్వారా పొంది జపించడమే శ్రేష్ఠమైన మార్గం.ఇట్టి మంత్రాలను బోధించే గురువును బోధక గురువు అంటారు.
ఆ గురువు మంత్ర సిద్ధి కల్గి ఉంటాడు.అలాంటి వారి నుండి పొందే మంత్రం సిద్ధి ప్రదమవుతుంది.
పుస్తకంలో రాసిన మంత్రాలను తానుగా గ్రహించి జపిస్తే బ్రహ్మ హత్యా పాతకం వస్తుందని ఒక హెచ్చరిక కూడా ఉంది.
పుస్తకే లిఖితాన్ మంత్రాన్ ఆలోక్య ప్రజపంతి యే బ్రహ్మహత్యా సమం తేషాం పాతకం పరికీర్తితమ్… స్వయంగా మంత్రాలు గ్రహించడం తగదని చెప్పడానికే ఈ విధంగా హెచ్చరించారు.
భవే ద్వీర్యవతీ విద్యా గురువక్త్ర సముద్భవా.అన్యథా ఫలహీనా స్యాత్ నిర్వీర్యాప్యతిదుఃఖదా… అని కూడా చెప్పారు.అంటే గురు ముఖతః వచ్చిన విద్య శక్తిమంతంగా ఉంటుంది లేకుంటే అది నిర్వీర్యమై దుఃఖ ప్రదం అవుతుందని భావం.మంత్రాలకూ, మూలికలకూ అగస్త్యుని శాపం ఉన్నదనీ, గురు ముఖతః వాటిని ఆ శాపం పనివచేయదనీ పెద్దలు అంటారు.
అందుకే ఇకపై మీరు కూడా సొంతంగా ఎలాంటి మంత్రాలను జపించకండి.గురూపదేశం పొందిన తర్వాత చదవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి.
అలాగే ఆయా దేవుళ్ల కృప కూడా మీపై ఉంటుంది.