శివరాత్రి రోజున అందరి చూపు.. తలపాగా పైనే ఎందుకు ఉంటుందో తెలుసా..

పవిత్రమైన మహాశివరాత్రి రోజు శ్రీశైలం మల్లన్నకు అలంకరించే తలపాగా అలంకరణకు ప్రత్యక్షమైన విశిష్టత ఉంది.శైవ క్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా శ్రీశైలం జ్యోతిర్లింగమూర్తికి అద్వితీయ సేవే ఈ పాగాలంకరణ.

 Srisailam Maha Shivaratri Celebrations , Maha Shivaratri , Srisailam , Srisail-TeluguStop.com

శ్రీశైలంలో కొలువు తీరని మల్లన్నకు ఎంతటి ఖ్యాతి ఉందో, పెళ్లి కుమారునిగా మల్లన్న ధరించే తలపాగాకు సైతం అంతే ఖ్యాతి ఉంది.లింగోద్భవ సమయంలో దేవాలయంపై ఉన్న నవ నందులకు అలంకరించి ఈ పాగను బాపట్ల జిల్లా చీరాల మండపంలోని పృథ్వి వంశీయులే ఎన్నో తరాలుగా నేస్తున్నారు.జాండ్రపేట పంచాయితీ హస్తినాపురానికి చెందిన పృథ్వి వెంకటేశ్వర్లు గత మూడు తరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.14 లోకాల్లో మల్లన్న అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించే సేవగా ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తున్నారు.

తమ సొంత మగ్గంపై రోజుకి మూరచొప్పున నియమ నిష్టతో తయారుచేస్తారు.అలా 300 మూర్ల చొప్పున వస్త్రాన్ని రూపొందిస్తారు.ప్రస్తుతం తన కుమారుడు వెంకట సుబ్బారావు సహకారంతో రూపొందించి స్వామివారికి సమర్పించారు.మహా శివరాత్రికి పది రోజుల ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

ఆ తర్వాత ఇంటిలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Telugu Devotional, Lord Shiva, Maha Shivaratri, Parvati Devi, Srisailam-Latest N

శ్రీశైలంకి తరలి వెళ్లే ముందు రోజు తలపాలను పృథ్వీ వంశీయులు ఇంటి నుండి జాండ్రపేట, వేటపాలెం, పందిళ్ళపల్లి ప్రాంతాల్లో మేళా తాళాల మధ్య ఊరేగింపు నిర్వహిస్తారు.స్వామివారి కల్యాణానికి ముందు పెండ్లి కుమారుడికి తలపాగా చుట్టే ఆచారశైలిని అనుసరించే పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం తరతరాలుగా పాగాలంకరణ సేవను చేస్తూ వస్తున్నారు.మహాశివరాత్రి పర్వదినాన చీకట్లో దిగంబరులై స్వామివారి గర్భాలయ విమాన కలశాలు, ముఖ మండవ నవ నందులకును కలుపుతూ పాగాలను అలంకరిస్తారు.

అసలు మహాశివరాత్రి రోజున మల్లన్న స్వామి వారికి నిర్వహించే పాగాలంకరణను దర్శించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి ఆ సంవత్సరం అంతా శుభాలు చేకూరుతాయని భక్తుల గట్టి నమ్మకం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube