సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా కలలు( Dreams ) రావడం అనేది సహజం.చాలామంది కలలు కంటూ ఉంటారు.
అయితే కొన్ని కలలు మంచిగా ఉంటే మరికొన్ని కలలు చెడుగా ఉంటాయి.చాలామందికి కొన్ని కలలు గుర్తు ఉంటే మరికొన్ని కలలు అస్సలు కొంచెం కూడా గుర్తు ఉండవు.
అయితే కొంతమంది చెడు కలల వలన తమ రోజు మొత్తం చాలా బాధగా, నిరాశగా ఉంటారు.దీని వలన వారు ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశాలు ఉంటాయి.
చెడు కలలు( Bad Dreams ) వస్తే ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు.అయితే స్వప్న శాస్త్రంలో( Swapna Shastra ) కలల గురించి చాలా విశ్లేషంగా చెప్పడం జరిగింది.
అయితే ఎలాంటి కల వస్తే మంచిది.ఎలాంటి కల వస్తే మంచిది కాదు.
అన్నదాని గురించి అందులో వివరించడం జరిగింది.

అలాగే ఎలాంటి కలలు వస్తే చెడు జరిగే అవకాశం ఉందన్నది స్వప్న శాస్త్రంలో తెలియజేశారు.అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కల వస్తే ఆ మనిషి ఆరు నెలల్లో చనిపోతున్నట్లే అని అంటున్నారు.ఆ కల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లగూబ( Owl ) గురించి కలలు కన్నప్పుడు, ఏదైనా గ్రామాన్ని ఖాళీ చేయడం గురించి కలకన్నప్పుడు, గ్రామాన్ని, ఇళ్లను ద్వంసం చేస్తున్నట్లు కల వస్తే మృత్యువు( Death ) సమీపిస్తున్నట్లే అని స్వప్న శాస్త్రం చెబుతోంది.అంతేకాకుండా కాకి లేదా గద్ద తలపై కూర్చున్నట్లు కల వచ్చినా కూడా అది మరణానికి సంకేతం అని చెబుతున్నారు.
అంతేకాకుండా శివ పురాణం( Shiva Puranam ) ప్రకారం పార్వతీదేవి ఒకసారి తన భర్త శివుడిని ఈ విధంగా అడుగుతుంది.

స్వామి మరణానికి సంకేతం ఏమిటి ? అలాగే మరణం రాబోతుందని ఎలా తెలుసుకోవచ్చు అని ప్రశ్నించింది.దానికి పరమశివుడు సమాధానమిస్తూ.ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు కొద్దిగా ఎరుపు రంగులోకి మారినప్పుడు ఆ మనిషి మరో ఆరు నెలలో చనిపోతున్నాడని అర్థం.
అలాగే ఒక పిట్ట నీళ్లలో మునిగి తేలుతున్నట్లు కలలో కనిపించిన కూడా వారు త్వరలో చనిపోతారని అర్థం చేసుకోవాలి.అని శివుడు చెప్పాడు.అయితే కొంతమంది వీటిని నమ్మితే మరి కొంత మంది మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నారు.కానీ స్వప్న శాస్త్రం ప్రకారం మాత్రం ఈ విధంగా కలలు వేస్తే లేదా ఇలాంటి సంకేతాలు శరీరం లో కనిపిస్తే మరో ఆరు నెలల్లో ఆ మనిషి చనిపోతాడట.