ఆడపడుచు ఒడిబియ్యం పోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా?

సాధారణంగా మన ఇంటి ఆడబిడ్డకు వివాహం చేసిన అనంతరం తనకి ఒడిబియ్యం పోసి అత్తవారింటికి సాగనంపుతారు.ఈ విధంగా ప్రతి సంవత్సరం తమ కూతురిని పుట్టింటికి పిలిచి తనకుఒడి బియ్యం పోసి అత్తవారింటికి సారే కట్టి పంపించడం ఆనవాయితీగా వస్తోంది.

 Odi Biyyam, Significance, Mahalakshmi,oddiyana Peetam,hindhu-TeluguStop.com

అసలు ఇలా అమ్మాయిలకు వడిబియ్యం పోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి.వడిబియ్యం పోయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిన ఆడపడుచును ఇలా ఏడాదికొకసారి పుట్టింటికి పిలిచి తనకు పసుపు, కుంకుమ, గాజులు తనకిష్టమైన దుస్తులను పెట్టి నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగళిగా జీవించమని ఆశీర్వదించి చేసే కార్యక్రమమే వడి బియ్యం కార్యక్రమం.

ఇది మాత్రమే కాకుండా ఒడిబియ్యం పోవడానికి మరొక కారణం కూడా ఉంది.మనిషి వెన్ను లోపల 72 వేల నాడులను ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.

ఈనాడులు కలిసేచోట చక్రం వుంటుంది.ఈ విధంగా మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి.

అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది.ఈ చక్రం మధ్యభాగంలో “ఒడ్డియాన పీఠం” ఉంటుంది కనుక అమ్మాయిలు నడుము ధరించే ఆభరణాలు అన్ని వడ్డానం అని కూడా పిలుస్తారు.

అదేవిధంగా అమ్మాయిలకు వడిబియ్యం పోయడం అంటే ఒడ్యాణపీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం.ఈ పీఠంలో ఉన్న శక్తి పేరు మహాలక్ష్మి.అందుకే ఆడపిల్లలను ఆ ఇంటి మహాలక్ష్మి గా భావించి ఇంటికి పిలిచి వారికి పసుపుకుంకుమలతో ఒడి బియ్యం సమర్పిస్తారు.ఈ విధంగా మన ఇంటి మహాలక్ష్మిని పిలిచి ఒడిబియ్యం పోయడమే కాకుండా వారి వెంట అష్టైశ్వర్యాలు కూడా వెళ్తాయని భావిస్తారు.

ఇవన్నీ వారి బిడ్డ తన అత్తవారింట్లో అష్టైశ్వర్యాలతో ఉండాలని భావించే తల్లితండ్రులు చేసే సంకల్ప పూజ అని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే తన తల్లి ఇల్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని వడిబియ్యం అనంతరం ఆ వడిబియ్యంలో 5 పిడికల బియ్యం తీసుకుని తమ తల్లిదండ్రుల ఇంటిలో పెట్టి తన పుట్టింటి గడపకు పసుపు రాసి ఒడి బియ్యంతో అత్త వారి ఇంటికి బయలు దేరుతుంది.

అత్తవారింటికి వెళ్ళిన ఆడపడుచు తన తల్లి పెట్టిన సారెను ముత్తయిదువులకు పంచి వారి నుంచి కూడా ఆశీర్వాదం పొందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube