ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం( lunar eclipse ) మే 5వ తేదీన ఏర్పడనుంది.వైశాఖ మాసం పూర్ణిమను బుద్ధ పూర్ణిమ గా ప్రజలు చెబుతూ ఉంటారు.
శుక్రవారం రోజు సాయంత్రం స్వాతి నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది.అయితే ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు.
అయినప్పటికీ ఈ రాశులపై ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యులు( Astrologers ) చెబుతున్నారు.ఈ గ్రహణ ప్రభావం శుక్రవారం రోజు రాత్రి 8.44 నిమిషముల నుంచి అర్ధరాత్రి 1.02 నిమిషముల వరకు ఉంటుంది.సైన్స్ ప్రకారం చంద్రగ్రహణం చంద్రునికి, సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రుడిపై పడదు అప్పుడు చంద్రుడు కనిపించడు.దీనినే చంద్రగ్రహణం అని అంటారు.అయితే సనాతన ధర్మంలో చంద్రుడిని రాహువు, కేతువు మింగడానికి ప్రయత్నిస్తారు అని చాలామంది ప్రజలు నమ్ముతారు.దానినే చంద్రగ్రహణం అని చెబుతూ ఉంటారు.
ఈ క్రమంలో పలు రాశుల వారిపై చంద్రగ్రహణం ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఏ రాశులపై ఈ ప్రభావం ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి వారిపై చంద్రగ్రహణం ప్రభావం అధికంగా ఉంటుంది.వీరి దాంపత్య జీవితంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.
వీరు మానసికంగా తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాబట్టి దంపతులు గ్రహణా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.

ఇంకా చెప్పాలంటే వృషభ రాశి ( Taurus )వారికి అధిపతి శుక్రుడు.కాబట్టి శుక్రవారం రోజు ఏర్పడే చంద్రగ్రహణం ప్రభావం ఈ రాశిపై కూడా తీవ్రంగా ఉంటుంది.ఈ రాశి వారు తప్పనిసరిగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.అంతేకాకుండా తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు.చాలా రకాల ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే చంద్రగ్రహణ సమయంలో జాతకంలో చంద్రుడి స్థానాన్ని బలోపేతం చేయడానికి చంద్రుని బీజ మంత్రం లేదా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
అయితే ఈ మంత్రాలు జపించే ముందు తులసి ఆకులను తీసుకోవడం వలన ఈ మంత్రాలు అత్యంత బలవంతం అవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.