ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians )ఇప్పటివరకు ఐదు టైటిల్స్ సొంతం చేసుకుంది.ఆరోసారి టైటిల్ దక్కించుకోవడం కోసం గట్టి ప్రయత్నమే చేస్తోంది.
వరుసగా జరిగిన రెండు మ్యాచ్లలో విజయం సాధించింది.మరొకవైపు సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) కూడా ఫామ్ లోకి రావడంతో ఫ్యాన్స్ లో సంతోషం నెలకొంది.
ముంబై జట్టు కాస్త ఫామ్ లోకి వచ్చిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మాత్రం ఓ చెత్త రికార్డు పడింది.గతంలో రోహిత్ శర్మ( Rohit Sharma ) బ్యాటింగుకు.
ప్రత్యర్థి బౌలర్లు తట్టుకోలేకపోయేవారు.ఎందుకంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరు అలా ఉండేది.
కానీ ఈ సీజన్లో మాత్రం బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన చేస్తూ.క్రీజు లో నిలబడడానికే తెగ ఇబ్బందులు పడుతున్నాడు.
ఒకవేళ కెప్టెన్సీ బాధ్యతల ఒత్తిడి వల్ల బ్యాటింగ్ పై ఎఫెక్ట్ పడి ఉండవచ్చు.

ఈ సీజన్లో ముంబై జట్టు 9 మ్యాచులు ఆడింది.అందులో రోహిత్ శర్మ 1, 21, 65, 20, 28, 44, 2, 3, 0 పరుగులు నమోదు చేశాడు.తాజాగా జరిగిన పంజాబ్ – ముంబై ( Punjab – Mumbai )మ్యాచ్ లో ఘోరంగా డకౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు.
రోహిత్ శర్మకు ఈ సీజన్లో ఇదే ఫస్ట్ డకౌట్.కానీ ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఇది 15వ డకౌట్ కావడం గమనార్హం.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డెకౌట్ అయిన బ్యాటర్ గా రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.ఆ జాబితాలో రోహిత్ తో పాటు మన్దీప్ సింగ్, దినేష్ కార్తీక్, సునీల్ నారైన్లు కూడా 15 సార్లు డకౌట్ అయ్యారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో పంజాబ్ జట్టుపై ముంబై జట్టు గెలిచింది అనే చర్చ కంటే రోహిత్ శర్మ డకౌట్ అయిన దాని గురించే చర్చ నడుస్తోంది.ఒకపక్క మ్యాచ్లు గెలుస్తూ.
మరొక పక్క చెత్త రికార్డులు ఖాతాలో పడుతూ ఉండడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.







