వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు.గుంటూరు అగ్రహారం పేరు మార్చి రాత్రికి రాత్రి ఫాతిమా పేరుతో బోరు పెట్టడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.
విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడంతో పాటు ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నించారన్నారు.ఇలాంటి ఘటనల వెనుక సూత్రధారి ఎవరని ప్రశ్నించారు.
ఓట్ల కోసం ప్రజలను విడదీయడం దుర్మార్గమని మండిపడ్డారు.







