ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy )ఏ పార్టీలో చేరుతారు ? ఎప్పుడు చేరుతారు అనే ఆసక్తి తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెలకొంది.ఆర్థికంగా స్థితిమంతుడు కావడం, బలమైన సామాజిక వర్గం అండ దండలు ఉండడం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున అనుచరగణం ఉండడం, ఇవన్నీ లెక్కలు వేసుకునే ప్రధాన పార్టీలన్నీ పొంగులేటిని చేర్చుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి బీఆర్ఎస్ ను ఓడించడమే తన లక్ష్యమని చెబుతూ, మళ్లీ కేసీఆర్ ( CK KCR ) ముఖ్యమంత్రి కాకుండా చూసే పార్టీని లోనే చేరుతానని ప్రకటించారు.అయితే ఆయన బిజెపిలో చేరబోతున్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.

ఈ మేరకు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ బృందం పొంగులేటితో బేటీ కాబోతున్నారు.దీంతో ఆ భేటీ తర్వాత ఆయన ఈ రోజే బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది.అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు .ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులకి టిక్కెట్ ఇవ్వాలనే షరతులు విధించారు.దీనికి బిజెపి కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.ఈ రోజు చేరికల కమిటీ తో చర్చలు ఎలా జరిగినా బిజెపిలో చేరేందుకు ఆయనకు ఎటువంటి అభ్యంతరం లేదు.
కాకపోతే ఇప్పటికిప్పుడు చేరడం కంటే, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత బిజెపి (BJP )అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరాలనే ఆలోచనతో పొంగులేటి ఉన్నారట.

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.మే 13న ఎన్నికల ఫలితాలు వెలువబడబోతున్నాయి.దీంతో మే 13 వరకు వేచి చూసి ఆ తరువాతే పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారట.

ఇదేలా ఉంటే ఈరోజు చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో భేటీ అవుతున్నారనే సమాచారం తనకు లేదని, దీనికి సంబంధించిన సమాచారం అందలేదని, అయినా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా చేసేందుకు ఎవరు తమ పార్టీలో చేరినా స్వాగతిస్తానని బండి సంజయ్ ప్రకటించారు.







