గోరుచుట్టు స‌మ‌స్య‌ను 2 రోజుల్లో త‌గ్గించే ఎఫెక్టివ్ రెమెడీస్ ఇవే!

గోరుచుట్టు.దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 Effective Home Remedies For Nail Fungus! Effective Home Remedies, Nail Fungus, N-TeluguStop.com

మ‌న ఇంట్లో దాదాపు ఎవ‌రో ఒక‌రు ఎప్పుడోక‌ప్పుడు ఈ స‌మ‌స్య‌ను ఫేస్ చేసే ఉంటారు.చేతి లేదా కాలి వేలి గోరు కుదుళ్ళలో చీముపట్టి బాధించే వ్యాధినే గోరుచుట్టు అంటారు.

ఇది చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ తీవ్ర‌మైన నొప్పిని క‌ల‌గ‌జేస్తుంది.దాంతో ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌డం కోసం ఏం చేయాలో తెలియ‌క మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

కొంద‌రు మందులు వాడుతూ ఉంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్‌ను ట్రై చేస్తే గ‌నుక స‌హ‌జంగానే గోరుచుట్టును నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్‌లో గోరు వెచ్చ‌ని నీరు, వ‌న్ టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ వేసి క‌లుపుకోవాలి.

ఈ నీటిలో గోర్లను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని తొక్క తొల‌గించి స‌న్న‌గా తురుముకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి త‌రుము, వ‌న్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, రెండు టేబుల్ స్పూన్ల వెనిగ‌ర్ వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌భావిత గోరుకు ప‌ట్టించి.

ఏదైనా క‌వ‌ర్‌తో క్లోజ్‌ చేసుకోవాలి.గంట అనంత‌రం నార్మ‌ల్ వాట‌ర్‌ను యూజ్ చేసి గోరును శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒకసారి చేస్తే గ‌నుక రెండు రోజుల్లోనే గురుచుట్టు స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మనం పొందొచ్చు.

Telugu Effective, Goru Chuttu, Tips, Latest, Nail Fungus, Nails, Paronychia-Telu

అలాగే మ‌రో విధంగా కూడా గోరుచుట్టును త‌గ్గించుకోవ‌చ్చు.అందుకోసం స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఐదు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌, రెండు టేబుల్ స్పూన్ల ల‌వంగాల పొడి వేసుకుని ఆరేడు నిమిషాల పాటు హీట్ చేసుకుని చ‌ల్లార‌బెట్టుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని గోరుకు అప్లై చేసి.

డ్రై అయిన త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube