ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, కంప్యూటర్ల (Computers)ముందు గంటల తరబడి కూర్చుని పనిచేయడం, ఒత్తిడి, నిద్రలేమి, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువు (Overweight)సమస్యను ఫేస్ చేస్తున్నారు.అలాగే వివాహం తర్వాత శరీరంలో వచ్చే మార్పుల కారణంగా ఆడవారిలో కొందరు భారీగా బరువు పెరుగుతుంటారు.
ఓవర్ వెయిట్ అనేది శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం నానా తంటాలు పడుతుంటారు.
అయితే ఎంత లావుగా ఉన్న వారైనా రోజు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్(Magical drink) ను కనుక తాగితే మల్లె తీగల మారడం ఖాయం.అందుకోసం ముందుగా ఐదు నుంచి ఆరు ఉసిరికాయలను(Amla) హాట్ వాటర్ లో బాగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, మూడు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు(Ginger slices), ఐదు నుంచి ఆరు గింజ తొలగించిన ఖర్జూరాలు(Dates), పావు టీ స్పూన్ ఉప్పు మరియు కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆపై అందులో మూడు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి వేసి సరిపడా వాటర్ పోసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే దాదాపు రెండు నుంచి మూడు వారాలపాటు వాడుకోవచ్చు.
ఇక ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో తయారు చేసుకున్న ఆమ్లా మిశ్రమాన్ని వన్ టేబుల్ స్పూన్ చొప్పున మిక్స్ చేస్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.ఈ డ్రింక్ ను ఖాళీ కడుపుతో రెగ్యులర్ గా తాగితే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతమవుతుంది.ఈ డ్రింక్ శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తుంది.
మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.బెల్లీ ఫ్యాట్ ను మాయం చేస్తుంది.
వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.అంతే కాకుండా ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.
సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తుంది.మరియు రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సత్తా కూడా ఈ డ్రింక్ కు ఉంది.