నవరాత్రి బ్రహ్మోత్సవాల పై.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కీలక ప్రకటన..!

ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు( Navratri Brahmotsavams ) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) ఈవో ఏవి ధర్మారెడ్డి ( TTD EO AV Dharma Reddy )వెల్లడించారు.తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు.

 Important Announcement Of Tirumala Tirupati Devasthanam On Navratri Brahmotsavam-TeluguStop.com

సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా చెప్పారు.

ఇందుకోసం ఈ నెల 14న అంకురార్పణ జరిగిందని వెల్లడించారు.

Telugu Bhakti, Devotees, Devotional, Lunar Eclipse, Srivari Temple, Ttdeo-Latest

ఈ ఉత్సవాలలో ప్రధానంగా అక్టోబర్ 19న గరుడసేవ, అక్టోబర్ 20న పుష్పక విమానం, అక్టోబర్ 22న స్వర్ణ రథం, అక్టోబర్ 23వ తేదీన చక్ర స్నానం నిర్వహిస్తామని వెల్లడించారు.ఉదయం వాహన సేవ ఎనిమిది నుంచి పది గంటల వరకు, రాత్రి వాహన సేవ ఏడు గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.అంతేకాకుండా గరుడ వాహన సేవ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుందని భక్తులందరికీ ( devotees )దర్శనం కల్పించేలా రాత్రి 12 గంటల వరకు ఉంటుందని ఈవో తెలిపారు.

ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవని బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

Telugu Bhakti, Devotees, Devotional, Lunar Eclipse, Srivari Temple, Ttdeo-Latest

ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులను వారిని సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరిగిందని వెల్లడించారు.వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లలు,తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా భక్తుల భద్రత దృష్ట్యా అక్టోబర్ 19న గరుడ సేవా రోజు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

అక్టోబర్ 19న గరుడ సేవా సందర్భంగా అక్టోబర్ 17 నుంచి 19వ తేదీ వరకు కాటేజీ దాతలకు గదుల కేటాయింపు ఉండదని తెలిపారు.అలాగే అక్టోబర్ 29వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం( lunar eclipse ) కారణంగా అక్టోబర్ 28న రాత్రి ఏడు గంటల ఐదు నిమిషములకు శ్రీవారి దేవాలయ( Srivari Temple ) తలుపులు మూసివేసి అక్టోబర్ 29వ తేదీన తెల్లవారుజామున మూడు గంటల 15 నిమిషములకు తెరుస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube