సినిమా ఇండస్ట్రీ చాలా విచిత్రమైనది.ఇది నిన్నటిదాకా అనామకులుగా ఉన్న వారిని ఓవర్‌నైట్‌లో సూపర్ స్టార్లని చేయగలదు.
అలానే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిని జస్ట్ సింగిల్ సినిమాతో పాతాళానికి తొక్కేయగలదు.కొంతమంది నటుల అదృష్టం బాగుంటే, మరి కొంతమందిని దురదృష్టం వెంటాడుతుంటుంది.
అందువల్ల వారు స్టార్టింగ్ సినిమాలతో హిట్స్ కొట్టినా ఆ తర్వాత ఫ్లాప్స్‌ను చవి చూస్తుంటారు.ఫ్లాప్స్ వస్తే ఎవరైనా సరే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది.
అలాంటి అన్‌లక్కీ హీరోయిన్లు కొందరు ఉన్నారు.వీరి కెరీర్ దాదాపు ట్రాక్ తప్పిందనే చెప్పాలి.వాళ్లు ఎవరో తెలుసుకుందాం.
• భాగ్యశ్రీ బోర్స్
మహారాష్ట్ర ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్స్( Bhagyashri Borse ) యారియాన్ 2, చందు ఛాంపియన్ వంటి హిందీ సినిమాల్లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది.తర్వాత రవితేజ హీరోగా నటించిన “మిస్టర్ బచ్చన్”( Mr Bachchan Movie ) సినిమాతో హీరోయిన్‌గా మారింది.ఇందులో చాలా కలర్‌ఫుల్‌గా కనిపించింది.రిలీజ్‌కు ముందు భాగ్యశ్రీ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.ఈ మూవీ హిట్టైతే ఈ క్యూట్ బ్యూటీకి పదుల సంఖ్యలో ఆఫర్లు వస్తాయని అనుకున్నారు.
నాలుగైదు సినిమాల్లో సైన్ చేసినట్లు కూడా తెలిసింది.కానీ ఇప్పటికీ ఒక్క సినిమాని కూడా ప్రకటించలేదు.
• అనన్య పాండే
అనన్య పాండే( Ananya pandey ) ఇండియన్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ “లైగర్”తో( Liger ) టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.పూరీ జగన్నాథ్ ఇంట్రడ్యూస్ చేసే ఏ హీరోయిన్ అయినా తర్వాత తెలుగులో కనిపించకుండా పోయింది.లైగర్ చాలా పెద్ద ఫ్లాప్ కావడం అనేది ఈమెపై ఎఫెక్ట్ చూపించింది.దీనివల్ల తెలుగు ఇండస్ట్రీ ఆమెకు ఛాన్సులు ఇవ్వకుండా పూర్తిగా గేట్లు మూసేసింది.
శాలిని పాండే
అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది శాలినీ పాండే.( Shalini Pandey ) అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.అయినా సరే తెలుగులో ఆమెకు ఆఫర్లు రావడం లేదు.
ఇలాంటి అందమైన హీరోయిన్లు ఖాళీగా ఉంటున్నా తెలుగు దర్శకులు మాత్రం హీరోయిన్ల కొరత ఉందని, హీరోయిన్లు కావలెను అంటూ కామెంట్లు చేస్తున్నారు.