మీ పిల్లలు నిద్రలో మాట్లాడుతున్నారా..? అయితే కచ్చితంగా..?

చిన్నపిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్నపిల్లలకు చాలా ముద్దుగా అలవాట్లు, ఆవభావాలు ఉంటాయి.

 Do Your Children Talk In Their Sleep? But Surely, Health , Health Tips, Scream-TeluguStop.com

వారిని చూసి మన ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు కలుగుతూ ఉంటుంది.కొన్నిసార్లు చిన్నపిల్లల కొన్ని అలవాటు మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది.

అప్పుడప్పుడు పిల్లలు నిద్రపోతున్న సమయంలో మాట్లాడుతూ ఉంటారు.ఇది చాలామంది తల్లిదండ్రులు గమనించే ఉంటారు.

నిద్రలోనే ఏవేవో ఎవరికో కబుర్లు చెబుతున్నట్లు చేస్తారు.ఇక మరికొన్నిసార్లు నిద్రలో అరవడం, భయపడటం, ఏడ్చడం ( Crying )లాంటిది కూడా చేస్తుంటారు.

Telugu Fear, Tips-Telugu Health

ఇలాంటివి చూసినప్పుడే మనకు ఎంతో భయం కలుగుతుంది .అకస్మాత్తుగా మీ పిల్లలు అర్ధరాత్రి ఇలా చేస్తున్నారంటే కచ్చితంగా ఈ అలవాటు మిమ్మల్ని భయపెడుతుంది.ఎందుకంటే ఈ అలవాటు పిల్లలలో సాధారణమైనదా లేదా ఏదైనా వ్యాధికి సంకేతమా అనే సందేహం కలుగుతుంది.నిజానికి పిల్లలు నిద్రలో మాట్లాడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.కొన్నిసార్లు పిల్లలు కలత చెందినప్పుడు కూడా ఇలా చేస్తుంటారు.భయంతో జ్వరం( Fever with fear ) తెచ్చుకున్నప్పుడు లేదా సెలవులకు, విహారయాత్రలకు వెళ్లడానికి సంతోషంగా ఉన్నప్పుడు కూడా నిద్రలో మాట్లాడుతారు.

Telugu Fear, Tips-Telugu Health

ఇక మరికొన్నిసార్లు పిల్లలు నిద్ర చక్రం చేదిరినప్పుడు, నిద్రలో ( Sleep )మాట్లాడుతారు.లేదా కుటుంబంలో ఎవరికైనా అలవాటు ఉంటే వంశపారంపర్యంగా కూడా పిల్లలకు ఈ అలవాటు వస్తుందని కొన్ని నివేదికలు కూడా చెబుతున్నాయి.ఇలా నిద్రలో మాట్లాడే అలవాటు వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి అని ఆందోళన చెందుతుంటే, చింతించాల్సిన అవసరం లేదు.అది సాధారణమైనదే.ఈ అలవాటు పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం అంతగా చేయదు.3 నుండి 12 ఏళ్ల పిల్లల వయసు ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.ఇలాంటి పనులు చేసే అలవాటు ఆడపిల్లల కంటే మగపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది.అయితే వారు పెరిగేకొద్దీ సమస్య దానంతట అదే పోతుంది.అయినప్పటికీ కూడా మనం నిద్రలో మాట్లాడడం ఆపడానికి ప్రయత్నించాలి.అయితే పిల్లల నిద్రపై దృష్టి పెట్టాలి.

వారు వేలకు నిద్రపోయేలా చేయాలి.కనీసం 8 నుండి 9 గంటలు నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

అప్పుడే ఈ అలవాటు పెద్దగా కనిపించదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube