న్యూస్ రౌండప్ టాప్ 20

1.గోదావరి వరద

ఎగువనున్న కాలేశ్వరం,  ఇంద్రావతి నదుల నుండి వచ్చే వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది.ఈరోజు రాత్రికి భద్రాచలం వద్ద 35 అడుగులు వేరే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.పవన్ కళ్యాణ్ పై రోజా విమర్శలు

Telugu Ambati Rambabu, Ap, Cm Kcr, Congress, Janasena, Janasenani, Roja, Osmania

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి రోజా విమర్శలు చేశారు.పవన్ దళపతి కాదని, చంద్రబాబు కోసం పని చేసే దళారి అని విమర్శించారు.

3.మహారాష్ట్రకు రెడ్ అలర్ట్

మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి .ముంబైలో భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ను ప్రకటించింది.

4.పారిశుద్ధ్య కార్మికులకు హరీష్ రావు విజ్ఞప్తి

Telugu Ambati Rambabu, Ap, Cm Kcr, Congress, Janasena, Janasenani, Roja, Osmania

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వీడి విధుల్లో చేరాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

5.జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు

పరువు నష్టం కేసులో అల్లు అరవింద్ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వెలువడింది.ఈ కేసులో సినీ హీరో రాజశేఖర్ – జీవిత దంపతులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది.

6.తిరుమల సమాచారం

Telugu Ambati Rambabu, Ap, Cm Kcr, Congress, Janasena, Janasenani, Roja, Osmania

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

7.మహారాష్ట్రకు కేసిఆర్

టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగస్టు ఒకటో తేదీన మహారాష్ట్ర లో పర్యటించనున్నారు.

8.కృష్ణ బోర్డు భేటీని బహిష్కరించిన తెలంగాణ

Telugu Ambati Rambabu, Ap, Cm Kcr, Congress, Janasena, Janasenani, Roja, Osmania

కృష్ణానది జలాల వినియోగంలో ఏపీ ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవడంలో అలసత్వం చూపుతున్న కృష్ణానది యాజమాన్య బోర్డ్ వైఖరి  పై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తూ కృష్ణ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని బహిష్కరించింది.

9.ఏపీ ఇంటర్మీడియట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఏపీ ఇంటర్మీడియట్ కార్యాలయం వద్ద ఉద్రత చోటుచేసుకుంది .ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు.

10.పోలవరం పనులను పరిశీలించిన మంత్రి

Telugu Ambati Rambabu, Ap, Cm Kcr, Congress, Janasena, Janasenani, Roja, Osmania

పోలవరం ప్రాజెక్టు పనులను ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు.

11.రాయచూరు గుంతకల్లు ప్యాసింజర్ రైలు రద్దు

నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా గుంతకల్లు- రాయచూరు, రాయచూరు -గుంతకల్లు ప్యాసింజర్ రైళ్లను ఈనెల 19 ,20 తేదీల్లో రద్దు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

12.పొత్తులపై పురందరేశ్వరి కామెంట్స్

Telugu Ambati Rambabu, Ap, Cm Kcr, Congress, Janasena, Janasenani, Roja, Osmania

 పొత్తుల విషయమై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి  స్పందించారు.ఈ విషయం కేంద్ర అధినాయకత్వం చూసుకుంటుందని , సరైన సమయంలో సరైన నిర్ణయం బిజెపి పెద్దలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు.

13.తెలంగాణలో భారీ వర్షాలు

అల్పపీడన ప్రభావంతో మరో 48 గంటల పాటు తెలంగాణలో భారీ వర్షం కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

14.మంత్రి ఇంటి ముందు పంచాయతీ కార్మికుల ఆందోళన

Telugu Ambati Rambabu, Ap, Cm Kcr, Congress, Janasena, Janasenani, Roja, Osmania

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు.

15.ఓయూలో విద్యార్థుల ఆందోళన

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.సిలబస్ పూర్తికాకుండానే పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

16.మైనార్టీ విద్యార్థులకు ఉచిత కోచింగ్

Telugu Ambati Rambabu, Ap, Cm Kcr, Congress, Janasena, Janasenani, Roja, Osmania

రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2023 – 24 విద్యా సంవత్సరంలో మైనారిటీలకు యూపీఎస్సీ 2024 కోసం ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీస్ సంక్షేమ అధికారి ఇలియాస్ తెలిపారు.

17.జిల్లాస్థాయిలో స్కిప్పింగ్ ఎంపికలు

ఉమ్మడి గుంటూరు జిల్లాల రోప్ స్కిప్పింగ్ జిల్లా స్థాయి ఎంపికలు ఎంటిఎంసీ  పరిధిలోని కుంచనపల్లి గీతాంజలి స్కూల్ లో జరగనున్నట్లు రోప్ స్కిప్పింగ్ ఎంపిక జిల్లాల కార్యదర్శి కే శివకుమార్ తెలిపారు.

18.తెలంగాణలో గెస్ట్ లెక్చరర్ నియామకానికి అనుమతి

Telugu Ambati Rambabu, Ap, Cm Kcr, Congress, Janasena, Janasenani, Roja, Osmania

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1654 మంది గెస్ట్ లెక్చరర్ లో నియామకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.

19.ఏపీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్

ఈనెల 24 నుంచి ఏపీలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కన్వీనర్ చదలవాడ నాగమణి తెలిపారు.

20.‘ క్యాప్ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన

కన్వీనర్ కోట సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్పడ్ పర్సన్ ( క్యాప్ ) కోట కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ఈనెల 18 19 తేదీల్లో హాజరుకావాలని కాళోజీ యూనివర్సిటీ సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube