రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలలో ఉగాది వేడుక ఎంతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు.ఈ రోజు ఇష్ట దైవాన్ని పూజించుకొని మరియు ఉగాది పచ్చడిని ప్రసాదంగా భావిస్తూ ఉంటారు.
ఈ పచ్చడి రుచి చూశాకే ఆ రోజు ఏమైనా ఇతర ఆహారాలను తింటూ ఉంటారు.ముఖ్యంగా ఆరు రుచుల కలయికతో తయారు చేసే ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ పచ్చడిలో ఆరు రుచులు జీవితంలోని కష్టసుఖాలను సూచిస్తూ ఉంటాయి.ఈ ఉగాది పచ్చడి( Ugadi Pachdi )లోకి తీపి, కారం, పులుపు, ఉప్పు, వగరు, చేదు వంటి కలయికతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.
బెల్లం, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, మామిడికాయ, వేప పువ్వు( Mango )ను ఆనవాయితీగా ఈ పచ్చడి తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు.ఉగాది పచ్చడి నోట్లో వేసుకోగానే తీపి తగిలితే ఈ సంవత్సరం అంతా కూడా మంచే జరుగుతుందని, అదేవిధంగా చేదు తగిలితే కష్టాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు నమ్ముతారు.
పులుపు తగిలితే కష్టసుఖాలు కూడా ఉంటాయని ఈ ఉగాది పచ్చడి తయారీలో ఒక ఆధ్యాత్మిక భావన కలిగి ఉంటుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.అలాగే పచ్చడిలో వాడే ప్రతి పదార్థం కూడా మనం ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుందని ఈ కాలంలో వచ్చే వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా ఈ పచ్చడి మనకి శక్తిని అందిస్తుందని మరికొంతమంది పండితులు చెబుతున్నారు.
అయితే ఈ పచ్చడి తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మిరపకాయలను, బెల్లాన్ని, మామిడికాయని బాగా తురుముకోవాలి.వీటికంటే ముందు చింతపండు( Tamarind )ను కాస్త నీటిలో నానబెట్టాలి.చింతపండు పిప్పిని తీసి పడేసి ఆ రసాన్ని ఒక గిన్నెలో ఉంచాలి.
ఇక వేప పువ్వును బాగా కలిపి పొడి పొడి భారేలా నూరాలి.చింతపండు నీళ్లలో ఉప్పు, మామిడి తురుము, బెల్లం తురుము,పచ్చిమిర్చి వేప తురుము ఇలా అన్నీ కలుపుకోవాలి.
ఆ తర్వాత కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు, జామ ముక్కలు కూడా కలుపుకోవచ్చు.ఇలా చేస్తే ఉగాది పచ్చడి తయారైపోతుంది.