తలలో రెండు సుడులు( Double Crown ) ఉంటే చాలామంది రెండు పెళ్లిళ్లు జరుగుతాయని ఆటపట్టిస్తూ ఉంటారు.ఇక మగవాళ్ళు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని అంటుంటారు.
ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.అసలు ఇది నిజమేనా దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కొంతమందికి మాత్రమే తలలో రెండు సుడులు కనిపిస్తాయి.దీని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు శాతం మందికి మాత్రమే రెండు సుడులు ఉన్నాయి అని ఒక అధ్యాయనం తెలిపింది.
నిజానికి ఎవరికైనా తలపై రెండు సుడిలు ఉంటే అది జన్యు సంబంధమైనది.అయితే పూర్వీకులకు ఇలా ఉంటేనే వాళ్లకు కూడా వస్తుంది.
అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో తలలో రెండు సుడులు ఉన్నవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని చెబుతారు.అయితే ఇది నిజమని ఇప్పటికీ రుజువు కాలేదు.
కేవలం ఇది నమ్మకాల మీదనే ఆధారపడి ఉంది.అయితే ఇలా రెండు సుడులు ఉన్నవారికి కొన్ని మంచి గుణాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం ( Astrology )చెబుతోంది.
అలాంటి వారు సహనం, ప్రేమ, సహాయం లాంటి లక్షణాలను కలిగి ఉంటారు.ఇలా డబుల్ ట్విస్టర్ హెయిర్ ఉండటం అనేది ప్రధానంగా జన్యుల( Jeans ) కారణంగానే జరుగుతుంది.

అయితే దీనికి అసలు చింతించాల్సిన అవసరం లేదు.పురుషులు, మహిళలకు ఇది వారి వారసత్వం నుంచి పొందుతారు.రెండు సుడులు ఉన్న వారిని చూడటం అరుదు.ఇలా ఉంటే రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది మాత్రం వాస్తవం కాదు.ఇది కేవలం శరీర లక్షణం మాత్రమే అని గుర్తించుకోవాలి.కానీ రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు జరుగుతాయని నమ్ముతారు.
లేదంటే పెళ్లి ముహూర్తం కుదిరిన తర్వాత కూడా పెళ్లి బంధం( Marriage ) తెగిపోయి, రెండో పెళ్లికి సిద్ధమవుతారని ఒక ప్రచారం ఉంది.

ఇది కచ్చితంగా జరుగుతుంది అని చెప్పలేము.శాస్త్రం ప్రకారం మాత్రం రెండు సుడులు ఉంటే మంచివారని అంటారు.సూటిగా ఏదైనా విషయాన్ని మాట్లాడుతారు.
ఓపికగా ఉంటారు.అందరితో కలిసి పోతారు అని చెబుతారు.
ఇలా తలలో రెండు సుడులు ఉన్నవారు ఏదైనా చేయడానికి ముందు 100 సార్లు ఆలోచిస్తారట.ఇక చుట్టూ ఉన్నవారిని సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తారు.
అంతే మాత్రం రెండు పెళ్లిళ్లు అవుతాయనే మాట మాత్రం వాస్తవం కాదు.