తల్లికి ఏం కష్టాలుంటాయి అంటే ఎవరైనా సరే, నవమాసాలు ఆమె మోసే బరువు గురించి మాట్లాడుతారు, ఆ తొమ్మిది నెలల జాగ్రత్తల గురించి, డెలివరీ సమయంలో ఆమె పడె అవస్థ, నొప్పుల గురించి మాట్లాడుతారు.అంతేనా, తల్లి శారీరకంగా, మానసికంగా ఒత్తిడి అక్కడితోనే అయిపోతుందా ? ఆ తరువాత ఆమెకి అలసట, నొప్పి ఉండదా? డెలివరీ తరువాత ఆమె అవస్థల గురించి ఎవరు మాట్లాడరే? వెజైనల్ బర్త్ (నార్మల్) డెలివరీ అయనా, ఆమె శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.హార్మోన్స్ బ్యాలెన్స్ వేరే దిశలో ఉంటాయి.శారీరకంగా నొప్పులు ఉంటాయి.కేవలం సిజేరియన్ అయినప్పుడే, ఆ గాయాలుంటేనే ఆమె మానసికంగా, శారీరకంగా బాధలో ఉన్నట్లు అర్థం కాదు.కాబట్టి నార్మల్ డెలివరీ అయినసరే, తల్లి ఈ పది విషయాలు పట్టించుకోవాలి.
1) విశ్రాంతి
విశ్రాంతి, నిద్ర .రెండూ బాగా తీసుకోవాలి.తొమ్మిది నెలలుగా ఆమె నొప్పులతో, శరీరంలో జరుగుతున్న మార్పులతో ఎన్నో నిద్రలేని రాత్రులని గడిపింది.శారీరకంగా, మానసికంగా అలసిపోయిన తల్లికి అన్నిటికన్నా ముందుగా మంచి నిద్ర, విశ్రాంతి అవసరం.
లేదంటే ఆమె మీద ఒత్తిడి ఇంకా పెరిగిపోతుంది.పుట్టిన బిడ్డను చూసుకోవాలి కాబట్టి ఆ తాలూకు స్ట్రెస్ మొదలవుతుంది.ఈ సమయంలో హార్మోన్స్ సమతూల్యం దెబ్బతినకూడదు అంటే విశ్రాంతి అవసరం.
2) గోరువెచ్చని నీటితో స్నానం
స్నానం ఎక్కువగా గోరువెచ్చని నీటితోనే చేయాలి.నార్మల్ డెలివరి జరిగినప్పుడు యోని స్ప్రెడ్ అవడం, తిరిగి మామూలు సైజుకి మారడం జరుగుతుంది.ఇలా జరిగినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది.వుల్వా దగ్గర కూడా గాయాలుంటాయి.కొందరికి స్టిచెస్ కూడా పడతాయి.
చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.రోజుకి రెండు మూడు సార్లు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
యోనిని గోరువెచ్చని నోటితోనే శుభ్రం చేసుకోవాలి.మూత్రవిసర్జన చేసినప్పుడల్లా క్లీన్ చేసుకోవడం మంచిది.
3) రక్తం కోసం ప్యాడ్స్ :
డెలివరీ తరువాత 2-6 వారాల వరకు రక్తం బయటకి రావడం చాలామందిలో చూసేది.ఇలాంటి సమయంలో హైజీన్ చాలా ఇంపార్టెంట్.
లేదంటే బ్యాక్టీరియా, ఆ తరువాత ఇంఫెక్షన్స్ దాడిచేస్తాయి.ఈ సమయంలో జరిగే బ్లీడింగ్ ని లోచియా అని అంటారు.
యూటెరస్ లోకి బ్యాక్టీరియా వెళ్ళకూడదు అంటే మంచి క్వాలిటి ప్యాడ్స్ వాడాలి.టాంప్టన్స్ కి బదులు ఎక్సట్రా మాక్సి ప్యాడ్స్ వాడటం బెటర్.
రక్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.అండర్ వియర్, ప్యాడ్స్ ఎల్లప్పుడూ డ్రైగా ఉంచుకోవాలి.
4) ఐస్ ప్యాక్స్ .నొప్పుల కోసం
యోని ప్రాంతం అంతా నొప్పిగా, మంటగా ఉంటుంది.ఈ నొప్ప, మంట నుంచి కాస్తంతైనా ఉపశమనం పొందాలంటే ఐస్ ప్యాక్స్ లేదా ఐస్ క్యూబ్స్ ఉపయోగించడం మేలు.ఎందుకంటే ఐస్ నరాలను మొండిగా ఉంచుతుంది.దాంతో నొప్పి పెద్దగా బయటకి తెలియకుండా ఉంటుంది.నొప్పి, మంట తీవ్రంగా ఉన్నప్పుడు ఇలా చేస్తే మేలు.అయితే డైరెక్ట్ గా పెట్టుకోకుండా, శుభ్రమైన ఫాబ్రిక్ క్లాత్ లో ఐస్ చుట్టి, ఎక్కడైతే ఉబ్బుగా, నొప్పిగా, మంటగా ఉందో, ఆయా ప్రదేశాల్లో దీన్ని ఉంచుతూ ఉండాలి.
5) కెగెల్ వ్యాయామం
Kegel Exercises, కెగెల్ వ్యాయామం పెల్విక్ నరాలకి చాలామంచిది.ముఖ్యంగా వెజైనల్ డెలివరి జరిగి, కోలుకోవాలనుకుంటున్న మహిళలకు ఈ తరగా వ్యాయామాలు ఎనలేని సహాయం చేస్తాయి.వీటి ద్వారా పెల్విక్ నరాలు బలంగా మారి, యోని – రెక్టిమ్ మధ్యలోని గాయలు, నొప్పులు తగ్గుతాయి.
అయితే ఈ కెగెల్ వ్యాయామాలు డెలివరీ జరిగిన ఒకటిరెండు వారాల తరువాతే మొదలుపెట్టాలి.ఇక వీటని ఎలా చేయాలంటే, మూత్ర విసర్జన చేసే నరాలను వేళ్ళతో పది సెకన్లపాటు బ్లాక్ చేసి, మరో పది సెకన్ల పాటు వదిలేయాలి.
ఇలా పదిపదిహేను సార్లు చేయాలి.ఈ వ్యాయామన్ని రోజుకి మూడుసార్లు చేయాలి.
6) ఉబ్బిన రక్తనాళాలతో జాగ్రత్త
అది సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయనా, ఆనస్ – రెక్టమ్ ని మధ్య రక్తనాళాలు కాస్త ఉబ్బుతాయి.దీంతో భరించలేని నొప్పి వేస్తుంది.
మలమూత్ర విసర్జన కూడా కఠినంగా అనిపిస్తుంది.అలాంటప్పుడు అధైర్యపడకూడదు.
నెచురల్ కాల్స్ లో ఎలాంటి నొప్పి ఉండకూడదు అంటే తాజా ఫలాలు, కూరగాయలు బాగా తినాలి.ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాల మీద దృష్టి పెట్టాలి.
మంచినీళ్ళు బాగా తాగాలి.కాఫీ, సోడా వదిలేయాలి.
7) వక్షోజాలు బరువుగా ఉంటాయి
డెలివరీ అయిన తరువాత వక్షోజాలు పాలుపట్టడానికి పూర్తిగా సిద్దపడుతాయి.అందుకే అవి బరువుగానూ, ఉబ్బినట్టుగానూ అనిపిస్తాయి.
ఇది అందిరకీ జరిగేదే.కొందరికి నిపుల్స్ బాగా నొప్పిగా కూడా ఉంటాయి.
అంతమాత్రానికే అధైర్యపడి బిడ్డకి పాలు పట్టకుండా ఉండకూడదు.నిజానికి పాలుపట్టడమే దీనికి పరిష్కార మార్గము.
పాలుపట్టడం ద్వారా కేవలం మీ బిడ్డే కాదు, మీరు కూడా లాభపడుతారు.డెలివరీ నుంచి త్వరగా రికవర్ అవుతారు.
8) సెక్స్ వద్దు
డెలివరీ తరువాత స్త్రీ శరీరం చాలా సున్నితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా, డెలివరీ తరువాత సెక్స్ లైఫ్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకోవాల్సిందే.
అది ఎన్ని నెలలు అనేది శరీర తత్త్వాన్ని బట్టి ఉంటుంది.కొందరికి రెండు నెలలే పట్టొచ్చు, కొందరికి నాలుగైదు నెలల సమయం అవసరం కావొచ్చు.యోని గాయాలు పూర్తిగా మానాలి.అందాకా శృంగారం జోలికి వెళ్ళి ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టకూడదు.
9) ఇంఫెక్షన్లతో జాగ్రత్త
డెలివరీ తరువాత ఇంఫెక్షన్లు దాడి చేసాయనుకోండి, రికవరీ ఇంకా కష్టం అవుతుంది.త్వరగా కోలుకోలేరు.
స్టిచెస్ దగ్గర ఇంఫెక్షన్ రావొచ్చు, బ్లాడ్డర్ లో ఇంఫెక్షన్ రావొచ్చు, లేదంటే యూటేరస్ లో ఇంఫెక్షన్ రావొచ్చు.ఇంఫెక్షన్లు వచ్చినప్పుడు యోనిలోంచి పచ్చ, ఆకుపచ్చ రంగులో ఫ్లూడ్ డిశ్చార్జ్ కావచ్చు.
స్టిచెస్ దగ్గర నొప్పి ఇంకా పెరగొచ్చు.బయటకొచ్చిన రక్తం నుంచి దుర్వాసన కూడా రావొచ్చు.
మూత్రంలో మంట, మాటిమాటికి మూత్రం రావడం కూడా ఇంఫెక్షన్ లక్షణాలే.ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి.
10) మానసిక సంతులనం
డెలివరీ నుంచి త్వరగా కోలుకోవాలంటే మానసిక స్థైర్యం అన్నటికన్నా ముఖ్యం.సింపుల్ గా అనిపించినా చాలా ముఖ్యమైన విషయం ఇది.ఎందుకంటే మీ ఆలోచనలే మీ శరీరంపై ప్రభావం చూపిస్తాయి.మీ ఆలోచనలే హార్మోన్స్ లో మార్పులకి కారణం అవుతాయి.
కాబట్టి మనసుని, మెదడుని ప్రశాంతంగా ఉంచుకోండి.భర్తతో కబుర్లు పెట్టండి.
బిడ్డ మాట్లాడదు .అయినా తనతో ముచ్చట్లయ పెట్టండి.ఇంటి వ్యవహారాలు, డబ్బు విషయాలు ఇవేవి కొన్నివారాలపాటు పట్టించుకోండి.ఒత్తిడంతా మీ భర్తపైనే పడ్డా ఫర్వాలేదు .ఇప్పుడు సహాయం చేసె స్థితి కాదు మీది.ప్రశాంతత, ఆనందం .ఇవి తప్ప అలోచనలతో తలనొప్పి వద్దు.