జియో మళ్లీ పెద్ద బాంబు పేల్చింది.సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ అంటూ మూడు నెలలపాటు ఉచిత సర్వీసులు ఇస్తామని ప్రకటిస్తే TRAI దానిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
దాంతో జియో ఆ ఆఫర్ ని నిలిపివేసింది.అప్పటికే జియో ప్రైమ్ ఎవరైతే తీసుకోని ₹303, ఆపై రిఛార్జీ చేసుకున్నారో, వారికి మాత్రం ముందు చెప్పినట్లుగానే సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ వర్తిస్తుందని, మూడు నెలల ఉచిత సర్వీసులు, మరో నెల పేయిడ్ సర్వీసు కలుపుకోని మొత్తం నాలుగు నెలలపాటు యూజర్ సెలెక్ట్ చేసుకున్న ప్యాక్ అందుబాటులో ఉంటుందని జియో ప్రకటించింది.
అయితే ఇటు ప్రైమ్ రిఛార్జీ చేయించుకోకుండా, అటు ప్రైమ్ లో ఉండి సమ్మర్ సర్ ప్రైజ్ రిఛార్జీ చేయించుకోకుండా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నవారు అస్సలు బాధపడొద్దు.ఎందుకంటే జియో కొత్తగా ధనాధన్ ఆఫర్ తీసుకొచ్చింది.
కొత్త బాటిల్ లో పాత వైన్ పోసినట్లు, కేవలం ఉచితం అనే ట్యాగ్ తీసేసి, ట్రాయ్ కి పెద్ద పంచ్ ఇచ్చాడు ముఖేష్ అంబాని.సమర్ సర్ ప్రైజ్ ఆఫర్ కి స్వల్ప మార్పులు చేసి దాన్నే ధనాధాన్ ఆఫర్ గా మార్చేసారు.
ఈ ఆఫర్ లో రెండు ప్యాక్స్ ఉన్నాయి.ఒకటి ₹309, రెండు ₹509.మీరు ఆల్రెడి ప్రైమ్ కస్టమర్ అయితే ₹309 లేదా ₹509 తో రీఛార్జీ చేయించుకోండి.₹309 ప్యాక్ తో రోజుకి 1GB డేటా వస్తుంది .ఈ ప్యాక్ మూడు నెలలు పనిచేస్తుంది.అదే ₹509 తో రీఛార్జీ చేయించుకుంటే రోజుకి 2GB డేటా వస్తుంది.
ఈ ప్యాక్ కూడా మూడు నెలల సర్వీసు అందిస్తుంది.ఇక అన్ లిమిటెడ్ కాల్స్, జియో ప్రీమియం యాప్స్ అదనంగా వస్తాయి.
ఇక్కడ మారిన పాయింట్ ఒక్కటే, సమ్మర్ సర్ ప్రైజ్ మొత్తం నాలుగు నెలల సర్వీసులు అందిస్తే, ధనాధన్ మూడు నెలలు పనిచేస్తుంది.ఇక ప్రైమ్ లో లేని జియో కస్టమర్లు, కొత్తగా జియో సిమ్ తీసుకోవాలనుకునే కస్టమర్లు బాధపడవద్దు, మీరు ₹309 + ₹99 = 408, లేదా ₹509 + ₹99 = 608 తో పైన చెప్పిన రెండు ప్యాక్స్ ని ఉపయోగించుకోవచ్చు.