హైదరాబాద్ వంటి నగరం ఏర్పాటు చేయడం అనేది సాధ్యం కాదు.భాగ్యనగరం ఎన్టీఆర్ వందల ఏళ్ల నుండి ఒక్కో మెట్టు అన్నట్లుగా అభివృద్ది అవుతూ వస్తోంది.
హైదరాబాద్ మొత్తం వందల కిలో మీటర్ల మేరకు విస్తరించి ఉంది.అంత నగరం కొన్ని రోజుల్లో ఏర్పాటు అయ్యేది కాదు.
కాని ఉత్తర ప్రదేశ్‌లో హైదరాబాద్ కంటే పెద్దదైన ఒక తాత్కాలిక నగరం ఏర్పాటు అయ్యింది.హైదరాబాద్ ను మించి కాంతులీనుతూ విద్యుత్ వెలుగుల్లో ఆ నగరం వెలిగి పోతుంది.
అయితే ఆ నగరం కేవలం తాత్కాలికం మాత్రమే.నెల రోజుల కోసం వందల కోట్లు ఖర్చు చేసి ఆ నగరంను యూపీ ప్రభుత్వం నిర్మాణం చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… హిందువులు ముఖ్యంగా ఉత్తర భారత దేశ హిందువులు పరమ పవిత్రంగా భావించే కుంభమేళ్లకు రంగం సిద్దం అయ్యింది.మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న కుంభమేళ కోసం స్వతహాగా సాదువు, హిందువు అయిన సీఎం యోగి ఆధిత్య నాధ్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా అద్బుతమైన ఏర్పాట్లతో గతంలో కంటే ఎక్కువ మంది వచ్చేలా పబ్లిసిటీ కూడా చేస్తున్నారు.వచ్చిన ప్రతి ఒక్కరికి సరైన దర్శనం అవ్వడంతో పాటు, పుణ్య స్నానంకు వీలు కల్పిస్తున్నారు.
ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అత్యంత భారీ తాత్కాలిక నగరంను ఏర్పాటు చేయించాడు.

కుంభమేళ కోసం యూపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి దాదాపుగా అయిదు వేల కోట్లను ఖర్చు చేస్తున్నాయి.గత కుంభమేళ కోసం కేవలం వెయ్యి కోట్లు ఖర్చు చేశారు.కాని ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కుంభమేళను నిర్వహిస్తున్నారు.
సాధువులు, సన్యాసులు ఇంకా హిందూ ధర్మ ప్రచారకులు పెద్ద ఎత్తున ఇక్కడకు రాబోతున్నారు.వారి కోసం అత్యంత విశాలమైన ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్కరికి అనుకూల వాతావరణం కల్పించబోతున్నారు.

కేవలం కుంభమేళ కోసం 250 కిలోమీటర్ల మేరకు రోడ్లు, 22 పెద్ద వంతెనలు నిర్మించారు.అయితే ఇవన్నీ కూడా తాత్కాలికంగానే ఉంటాయి.ఆ తర్వాత అన్ని కూడా తొలగిస్తారు.మొత్తం పాతిక వేల మంది ఈ మాయా నగరం అదే తాత్కాలిక నగరంలో గస్తీ కాయబోతున్నారు.జనవరి 15 నుండి ప్రారంభం కాబోతున్న ఈ కుంభమేళకు దాదాపు 200 దేశాల నుండి 12 నుండి 15 కోట్ల మంది వస్తారనేది యూపీ ప్రభుత్వం అంచనా.ప్రతి సంత్సరం కంటే ఈ సంవత్సరం 10 నుండి 15 శాతం భక్తులు అధికంగా రాబోతున్నారనేది కూడా ఒక అంచనా.
ఇంత హడావుడి చేయడంను కొందరు హేతువాదులు తప్పుబడుతున్నారు.మరీ ఇంత ఖర్చు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.
DEVOTIONAL