లక్ష్మీ దేవిని ఎంతో ప్రత్యేకంగా పూజిస్తారు.లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి, సిరిసంపదలకు అధిపతి.
మనకు అష్టైశ్వర్యాలు చేకూరాలన్న అందుకు ఆ తల్లి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి.అందుకే భక్తులు అమ్మవారిని వివిధ రూపాలలో ఉన్న ఫోటోలను, విగ్రహాలను తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుని పూజిస్తారు.
అయితే వీటిలో కొన్ని రకాల లక్ష్మీ దేవి ఫోటోలు విగ్రహాలు మన ఇంట్లో ఉంటే ధన ప్రాప్తి కలగదని శాస్త్రాలు చెబుతున్నాయి.అంతేకాకుండా అలాంటి ఫోటోలు మన ఇంట్లో ఉండటం వల్ల ధన నష్టం కూడా సంభవించి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.
* లక్ష్మీదేవి గుడ్లగూబ పై కూర్చుని ఉన్నటువంటి ఫోటో మన ఇంట్లో ఉండకూడదు.ఈ ఫోటో మన ఇంట్లో ఉండటం వల్ల అనేక సమస్యలతో సతమతమవుతూ, అధిక మొత్తంలో ధన నష్టాన్ని ఎదుర్కొంటారు.
* పాము పై ఆ విష్ణుమూర్తి సేదతీరుతుండగ లక్ష్మీదేవి తన పాదాల చెంత ఉన్న ఫోటోను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది.అంతే కాకుండా తామర పువ్వు పై లక్ష్మీదేవి కూర్చొని ఉన్నటువంటి, నిల్చుని ఉన్న ఫోటోలను పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుంది.
* సంపదకు కారకుడైన కుబేరుని ఫోటోలను మన ఇంట్లో పెట్టుకుంటే దానితో ఆ లక్ష్మీదేవి సంతృప్తి చెంది, ఆ ఇంట్లోవారికి అష్టైశ్వర్యాలను చేకూరుస్తుంది.అలాగే గరుత్మంతుడు పై లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉన్న ఫోటోలను పూజించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.
*లక్ష్మీ దేవి విగ్రహాలు వివిధ లోహాలతో తయారు చేస్తుంటారు.అందులో పాదరసంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజించడం వల్ల అన్ని శుభాలు కలగడమే కాకుండా, ధనం కూడా సమకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
*దీపావళి ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రత్యేకమైన రోజు.ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
ఇంతటి ముఖ్యమైన రోజున స్పటిక శ్రీ యంత్రాన్ని ఎర్రటి బట్టలో చుట్టి మనం డబ్బు నిల్వ ఉంచుకున్న చోట పెట్టడం ద్వారా ఆ ఇంట్లో అంతా శుభ పరిణామాలు జరుగుతాయి.అంతేగాకుండా దీపావళి రోజున లక్ష్మీ దేవితో పాటు కుబేరుని కూడా పూజించి కుబేర మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల భక్తులు కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.