నేటి ఆధునిక కాలంలో సంతాన సమస్యలతో సతమతం అవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.ఈ క్రమంలోనే పిల్లల కోసం దంపతులు హాస్పటల్స్ చుట్టూ తిరుగుతుంటారు.
మందులు వాడుతుంటారు.ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటారు.
అయితే కొన్ని కొన్ని ఆహారాలు కూడా సంతాన సమస్యలను సమర్థవంతంగా దూరం చేస్తాయి.అటువంటి ఆహారాల్లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీ ఒకటి.
ఈ స్మూతీని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే.సంతాన సమస్యలు దూరం అవ్వడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు సైతం లభిస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.
తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఫూల్ మఖానా వేసి వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న ఫూల్ మఖానాను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక యాపిల్ ను తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తరువాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫూల్ మఖానా పొడి, వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్, నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకున్న జీడి పప్పులు ఐదు, ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఫూల్ మఖానా యాపిల్ స్మూతీ సిద్ధం అవుతుంది.

ఈ స్మూతీ టేస్టీగా ఉండటమే కాదు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.దీనిని బ్రేక్ ఫాస్ట్‌లో చేర్చుకుంటే.దంపతుల్లో లైంగిక సమర్థాన్ని పెంపొందిస్తుంది.
అలాగే మహిళల్లో ప్రత్యుత్పత్తిని.పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యతను ఈ స్మూతీ రెట్టింపు చేస్తుంది.
మరియు ఇతర సంతాన సమస్యలు ఏమైనా ఉన్నా.వాటిని నివారించి సంతానప్రాప్తి కలిగేందుకు సహాయపడుతుంది.
పైగా ఈ స్మూతీని తీసుకుంటే బరువు కూడా అదుపులోకి వస్తుంది.కాబట్టి, తల్లీదండ్రులు కావాలని ఆరాటపడుతున్న దంపతులు తప్పకుండా ఈ ఫూల్ మఖానా యాపిల్ స్మూతీని డైట్ లో చేర్చుకోండి.