ముఖ్యంగా చెప్పాలంటే శనివారం రోజు త్రయోదశి కలిసి వస్తే ఆ రోజునే శని త్రయోదశిగా( Shani Trayodashi ) పిలుస్తారు.ఇవి రెండూ కలిసి రావడం ఎంతో విశిష్టమైనది.
మార్చి 23వ తేదీన శనివారంతో పాటు త్రయోదశి తిధి కూడా వచ్చింది.శని త్రయోదశి పరమేశ్వరుడికి మహా ప్రీతికరమైన రోజు.
శనివారం రోజు త్రయోదశి వస్తే శని అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.శని జన్మించిన తేదీ కూడా త్రయోదశి అని పండితులు చెబుతున్నారు.
అందుకే ఈరోజుకి అంత ప్రాముఖ్యత ఉంది.శని త్రయోదశి రోజు శనీశ్వరుడికి ప్రత్యేకమైన ఏలినాటి శని, అర్ధాష్టమ శని, గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు.

శని త్రయోదశి శనీశ్వరుడికి( Shaneeshwarudu ) అత్యంత ప్రీతికరమైన రోజు అని నిపుణులు చెబుతున్నారు.శని గ్రహ బాధల నుంచి విముక్తి కలిగేందుకు ఈరోజు కొన్ని పనులు చేయాలి.శనివారం రోజు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వద్ధ వృక్షంపై ఉంటారని పురాణాలలో ఉంది.అందుకే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షణలు చేయడం మంచిది.శని త్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి.శనీశ్వరుడు దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనె( Sesame Oil )తో శనికి తైలాభిషేకం చేయాలి.
దోషాలు ఉన్నవాళ్లు శనికి సంబంధించిన శాంతి పూజలు జరిపించాలి.కాకులకు ఆహారం పెట్టాలి.

నల్ల నువ్వులు( Black Sesame Seeds ), నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల శని బాధలు తొలగిపోతాయి.శని త్రయోదశి రోజు ఈ శ్లోకం పట్టించి శనివారం రోజు ఉపవాసం ఉండడం మంచిది.శని శాంతి పూజలు చేసేందుకు శని త్రయోదశి ఎంతో మంచి రోజు అని పండితులు చెబుతున్నారు.నల్లని వచనాలు ధరించడం లేదా దానం చేయడం రెండు చేసినా మంచిదే అని చెబుతున్నారు.
కొన్ని నల్ల నువ్వులు కొద్దిగా నువ్వుల నూనె, బొగ్గులు, నల్ల రిబ్బన్, ఎనిమిది ఇనుప మేకులు, కొన్ని నవధాన్యాలను ఉండలుగా వస్త్రంలో చుట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది.