త్వరలో లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనుంది.ఈ మేరకు ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రచారాన్ని ప్రారంభించనుంది.
ఇందులో భాగంగా తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )తో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.
అలాగే ఈ సభా వేదికపై నుంచి మల్లికార్జున ఖర్గే ఎన్నికల మ్యానిఫెస్టో( Elections Manifesto )ను తెలుగులో విడుదల చేయనున్నారని తెలుస్తోంది.కాగా లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తరువాత కాంగ్రెస్ నిర్వహిస్తున్న మొదటి సభ ఇదే.ఈ క్రమంలోనే లోక్ సభలో మెజార్టీ సీట్లను సాధించాలని కాంగ్రెస్ భావిస్తున్న సంగతి తెలిసిందే.







