గణేశుడికి ఈ ప్రసాదాలు సమర్పిస్తే.. ఏమవుతుందో తెలుసా..?

వినాయక చవితి( Vinayaka chavithi ) వచ్చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.కాబట్టి ప్రతి చోట కూడా గణేష్ ఉత్సవానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 Do You Know What Happens If You Offer These Prasads To Ganesha , Vinayaka Chavit-TeluguStop.com

ఇక వినాయకుడిని స్వాగతించేందుకు భక్తులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.అంతేకాకుండా అలంకారాలు అలాగే ప్రసాదం వరకు అన్నీ కూడా నిర్ణయించుకొని గణపతి సేవను వైభవంగా నిర్వహించాలని అందరూ కూడా సిద్ధమవుతున్నారు.

ఇక గణేశుడికి నైవేద్యంగా మోదకం, బియ్యం, కొబ్బరి, బెల్లంతో తయారుచేసిన ఆహారాలను ముందుగా సమర్పిస్తారు.అయితే వినాయకునికి మోదకము చాలా ప్రీతికరమైనది.

అందుకే దానిని విడిచిపెట్టి వాడే నివేదిత్యము చేయవచ్చు.ఇక వినాయకుడికి శనగ చూర్ణం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు.

Telugu Bhakti, Coconut, Devotional, Fruits, Ganesha, Grate Coconut, Jaggery, Kud

ఇక ప్రతిరోజు ఉదయం గణేష్ ఉత్సవంలో సాయంత్రం వినాయకుడికి ప్రసాదం సమర్పించాలి.అలాగే అందులో ధాన్యాలు, బర్ఫీ, గ్రాన్యూలేటర్ షుగర్, పండ్లు ( Fruits )లాంటివి ఉన్నట్టు చూసుకోవాలి.ఇక వినాయకుడికి ( Ganesha )మరీ ముఖ్యంగా ఇష్టమైనవి కుడుములు( Kudumulu ) అలాగే పాలతాలికలు.ముందుగా కుడుములు తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోయాలి.ఆ తర్వాత అందులో తగినంత ఉప్పు, శనగవుపప్పు వేసి స్టవ్ మీద పెట్టాలి.

ఇక ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ పోయాలి.ఇక మెత్తగా ఉడికిన తర్వాత కిందకు దించి కొబ్బరి తురుము( Grate coconut ) వేసి కలపాలి.

ఇక చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే కుడుములు తయారవుతాయి.

Telugu Bhakti, Coconut, Devotional, Fruits, Ganesha, Grate Coconut, Jaggery, Kud

ఇక పాలతాలికలు తయారీ విధానం చూద్దాం.ముందుగా ఒక గిన్నెలో పాలు, నీళ్లు రెండింటిని కలిపి మరిగించాలి.పొంగు రాగానే అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి.

ఆ బియ్యం పిండిలో మైదాపిండి, ఒక స్పూన్ పంచదార వేసి మరుగుతున్న సగ్గుబియ్యం పిండి కలుపుకోవాలి.ఈ పిండిని జంతికల గిద్దేతో మరుగుతున్న పాలల్లోకి వత్తాలి.

లేదా చేత్తో పొడుగ్గా చేసి మరుగుతున్న పాలలో వేయాలి.ఇక తాలికలు పాలలోనే ఉడుకుతాయి.

ఇక నెమ్మదిగా కలుపుతూ ఉండాలి.లేకపోతే ముద్దగా మారిపోయే అవకాశం ఉంటుంది.

తాలికలు ఉడికేలోపు బెల్లం, పంచదార కలిపి పాకం చేసుకోవాలి.ఇక ఉడికిన తాలికలను చల్లారాక పాకం లో యాలకల పొడి వేసి కలిపితే పాలతాలికలు తయారవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube