తిరుమల కొండకు భారీగా తరలివస్తున్న భక్తులు.. ఆదివారం రోజు హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?

తిరుమల( Tirumala ) పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజలను తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) రద్దు చేసింది.

 Devotees Are Flocking To Tirumala Hill.. Do You Know The Income Of Hundi On Sun-TeluguStop.com

విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు తిరుమల దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.ఇంకా చెప్పాలంటే ఆదివారం రోజు స్వామి వారిని దాదాపు 87 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

అలాగే స్వామి వారికి దాదాపు 40 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, భక్తులు( Devotees ) హుండీ ద్వారా స్వామివారికి కానుకలుగా దాదాపు నాలుగు కోట్లు సమర్పించారు.

Telugu Andhra Pradesh, Devotees, Devotional, Hundi, Srivenkateswara, Sunday, Tir

అలాగే 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా టైం స్లాట్ టోకెన్లు లేని సర్వ దర్శనం భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతుంది.ఇంకా చెప్పాలంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం మాత్రమే పడుతున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.అలాగే శ్రీవారి దేవాలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వెంకటేశ్వరుడికి ( Sri venkateswara swamy )అర్చకులు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధన ద్వార దేవాలయ ద్వారములను తెరిచిన అర్చకులు బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్తోత్రం తో స్వామి వారిని మేల్కొల్పారు.

Telugu Andhra Pradesh, Devotees, Devotional, Hundi, Srivenkateswara, Sunday, Tir

ఆ తర్వాత తోమాల అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్వప్న మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్బార్ నిర్వహించారు.ముఖ్యంగా చెప్పాలంటే ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్న ప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.ఇంకా చెప్పాలంటే స్వామివారికి సోమవారం రోజు నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

ముఖ్యంగా చెప్పాలంటే ఉత్సవమూర్తుల విగ్రహాల పరిరక్షణలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube