సరస్వతీదేవిగా దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి.ఇవాళ అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో దుర్గమ్మ.

 Bejawada Kanaka Durgamma As Saraswati Devi Devotees Rush In Indrakeeladri, Bejaw-TeluguStop.com

సరస్వతీదేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.విశిష్ఠమైన రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు.

దీంతో ప్రకాశం బ్యారేజీపై వాహనాల రద్దీ పెరిగింది.అర్ధరాత్రి రెండున్నర గంటల నుంచి దర్శనానికి క్యూలైన్లలో అనుమతించారు.

అంతరాలయం, ప్రత్యేక దర్శనం టికెట్లు రద్దు చేసి అందరికీ ఉచితంగానే అమ్మవారి దర్శన అవకాశం కల్పిస్తున్నారు.

విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) కుటుంబ సమేతంగా సరస్వతీదేవిగా కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను మూల నక్షత్రం రోజున దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) మాట్లాడుతూ… ఆనవాయితీగా వస్తున్న ఆచారం పాటిస్తూ మూలనక్షత్రం రోజు ఉదయం అమ్మవారిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube