భోగి పండుగ రోజు వీటిని చేయడం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయా..

సనాతన ధర్మంలో కాలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సమయాన్ని సూర్య, చంద్ర, నక్షత్రాల ఆధారంగా లెక్కిస్తారు.

 Doing These Things On The Day Of Bhogi Festival Will Bring Happiness , Bhogi Fes-TeluguStop.com

సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి ప్రవేశించేటువంటి కాలమును రవి సంక్రమణం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.ఈ రవి సక్రమణాలు జరిపేటువంటి కాలమును పుణ్యకాలముగా శాస్త్రములు తెలిపినట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత చిలుకమర్తి పంచాంగ కర్త బ్రహ్మశ్రీ, చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వెల్లడించారు.

అంతేకాకుండా సూర్య భగవంతుడు ధను రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన పుణ్య కాలమే మకర సంక్రాంతిగా చెబుతూ ఉంటారు.మకర సంక్రాంతికి ముందు రోజును భోగిగా భక్తులు జరుపుకుంటూ ఉంటారు.

సంక్రాంతి సమయము చలి ఎక్కువగా ఉండేటువంటి కాలము అంతేకాకుండా భోగి రోజు చలిని తరిమికొడుతూ ప్రజలు ఉదయాన్నే లేచి చలిమంటలు వేసుకుంటూ ఉంటారు.తమలోని పాత ఆలోచనలు అగ్నికి ఆహుతి అవుతాయి.

కొత్త ఆలోచనలు చిగురించాలని దేవుడిని వేడుకుంటూ ఉంటారు.ఇంట్లో నీ పాత వస్తువులను భోగిమంటల్లో వేసి తమ గతాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు.

అందుకే భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి బ్రహ్మ ముహూర్త కాల సమయంలో భోగి మంటలను వేసి అగ్ని దేవతలను తలుచుకొని అక్కడ లభించినటువంటి విభూదిని ప్రధానంగా స్వీకరించడం సాంప్రదాయంగా వస్తోంది.

Telugu Astrology, Bhogi Festival, Devotional, Festival, Lakshmi Devi, Sankranti,

ఆ భోగి మండల పై కాచిన నీటీ తో ఇంటిల్లిపాది తలస్నానము చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చాలామంది ప్రజలు భావిస్తారు.భోగి పండుగ రోజు అన్నీ కొత్త వాటితో ముడిపడి ఉంటాయి.అందుకే భోగి నూతన జీవిత ఆరంభానికి చిహ్నంగా జరుపుకుంటారు.

భోగి రోజు సాయంత్రం ప్రతి ఇల్లు శుభ్రపరచుకొని దీపాలు వెలిగించి బొమ్మల కొలువును ఏర్పాటు చేసి పిల్లలకు భోగి పండుగ వేస్తారు.భోగి పళ్ళు, శనగలు, పువ్వులు, కాయిన్స్ పిల్లల తల మీద నుంచి పోయడం వలన వారికి ఉన్న నరగోష దూరమైపోతుందని ప్రజలు నమ్ముతారు.

అంతేకాకుండా పిల్లలపై సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా కలిగి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.ఆ ఇంటికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని కూడా నమ్ముతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube