శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఇప్పటినుంచి కొత్త రూల్..

తిరుమలలో ఇప్పటి నుంచి కొత్త రూల్ అమలులోకి వస్తోంది.భక్తుల కోసం ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

 Important Note For Srivari Devotees New Rule From Now ,srivari Devotees ,tiruma-TeluguStop.com

శ్రీవారి సర్వదర్శనం, లడ్డు ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్ చెల్లింపులు తదితర అంశాల్లో మరింత పాదర్శకతం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.ఒక వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు తీసుకోకుండా నివారించేందుకు, వసతి గదుల కేటాయింపు కేంద్రాల వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు టిటిడి అధికారులు పేర్కొన్నారు.

మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఉపయోగిస్తామని వెల్లడించారు.దళారీ వ్యవస్థకు కూడా చెక్ పెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే తిరుపతిలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా ఉంది.ఒక కంపార్టుమెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.

Telugu Bakti, Devotional, Face, Tirumala-Latest News - Telugu

సోమవారం శ్రీవారిని దాదాపు 61 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.ఇంకా చెప్పాలంటే 20,000 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు.సోమవారం స్వామివారి హుండీకి రూ 4.2 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. జ్ఞాన ప్రసూనాంబ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.

తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

Telugu Bakti, Devotional, Face, Tirumala-Latest News - Telugu

దేవాలయ ధర్మకర్తల మండలి ఏవి ధర్మారెడ్డి దంపతులకు స్వాగతం పలికారు.ధర్మారెడ్డికి దేవాలయ అర్చకులు తలపాగా చుట్టి తల మీద పట్టు వస్త్రాలు ఉంచారు.పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 7 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించారు.ఈ కార్యక్రమాలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube