హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో నాగుల చవితి( Nagula Cavithi ) కూడా ముఖ్యమైనది.రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా జరుపుకునే పండుగ నాగుల చవితి అని కచ్చితంగా చెప్పవచ్చు.
నాగుల చవితి రోజు పుట్టలకు పూజలు చేసి నాగదేవతకు పాలు పోసి ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు.ఈ రోజు పూజలు చేస్తే సర్వ రోగాలు దూరమై, సకల పాప హరణం జరుగుతుందని భక్తులు నమ్ముతారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధించి పుటలో పాలు పోసి తమ తమ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.నాగుల చవితి రోజు మహిళలు ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజిస్తారు.
![Telugu Devotional, Problems, Hindu Dharma, Nagadevata, Nagula Cavithi, Puja Mand Telugu Devotional, Problems, Hindu Dharma, Nagadevata, Nagula Cavithi, Puja Mand](https://telugustop.com/wp-content/uploads/2023/11/Hindu-Dharma-Nagula-Cavithi-Nagadevata-fasting-Health-problems-Puja-Mandir.jpg)
పుట్టల దగ్గర శుభ్రం చేసి నీళ్లు చల్లి, ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి పూలతో అలంకరించి పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజిస్తారు.నాగదేవతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని,రోగాల బారిన పడిన వారికి ఉపశమనం లభిస్తుందని కూడా చెబుతున్నారు.నాగుల చవితి రోజున నాగ దేవతను శివ భావంతో పూజిస్తే అనారోగ్య సమస్యలు ( Health problems )దూరం అవుతాయని కూడా చెబుతున్నారు.సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా భావించి పూజించే గొప్ప సాంస్కృతి భారతీయ సాంస్కృతి.
అందులో భాగంగానే నాగదేవతను పూజిస్తూ వస్తున్నారని చెబుతున్నారు.
![Telugu Devotional, Problems, Hindu Dharma, Nagadevata, Nagula Cavithi, Puja Mand Telugu Devotional, Problems, Hindu Dharma, Nagadevata, Nagula Cavithi, Puja Mand](https://telugustop.com/wp-content/uploads/2023/11/Hindu-Dharma-devotional-Nagula-Cavithi-Nagadevata-fasting-Health-problems-Puja-Mandir.jpg)
నాగుల చవితి రోజున ఉదయాన్నే నిద్ర లేచి, తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి, ఇంటిని, పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని పూజ మందిరంలో కలశాన్ని ఏర్పాటు చేసి దాని పై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి.నాగేంద్ర స్వామి ప్రతిమను కానీ, ఫోటోలు కానీ పూజ గదిలో పెట్టి పూజలు చేసుకోవాలి.స్వామి దీపారాధనకు నువ్వుల నూనె ఉపయోగించాలి.
ఇంట్లో పూజ ముగించిన తర్వాత పొట్ట దగ్గరకు వెళ్లి పాలు పోయాలి.పుట్ట వద్ద దీపం వెలిగించి పూజ చేయాలి.
పూజ చేసిన తర్వాత పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి.నాగుల చవితి రోజు నాగదేవతకు పంచామృతాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు( Scholars ) చెబుతున్నారు.
DEVOTIONAL