కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది.తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కొడంగల్ లో అభివృద్ధి జరిగిందని తెలిపారు.
ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.ఉపాధి కూలీలకు ఏడాదికి రూ.12 వేలతో పాటు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు.