భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలను కలిగి ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.దశాబ్ధాల క్రితమే పంజాబీలు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే తదితర దేశాలకు వలస వెళ్లి దేశానికి పెద్ద సంఖ్యలో విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్నారు.
విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం పంజాబ్ ప్రభుత్వాలు దశాబ్ధాలుగా కృషి చేస్తూనే ఉన్నాయి.అయితే పంజాబీ ఎన్ఆర్ఐల ఆస్తులు కబ్జాకు గురి అవుతుండటం పెద్ద సమస్యగా మారింది.
వీరి ఆస్తులు, వ్యవసాయ భూములను బంధువులు, సన్నిహితులే చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుంటున్నారు.ఈ ఆస్తులను తిరిగి పొందేందుకు వీరు సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది.
ఇలా ఆస్తులను తిరిగి పొందిన ప్రవాస భారతీయులు వాటిని విక్రయించి జన్మభూమితో బంధం తెంచుకుంటున్నారు.
ఎన్ఆర్ఐల కబ్జా సమస్యలను పరిష్కరించడానికి ‘‘ ఎన్ఆర్ఐ సభ పంజాబ్(NRI Sabha Punjab) ’’ కీలక ప్రతిపాదన చేసింది.
అదే ‘Gold for NRIs, Green for Punjab’ .దీని ప్రకారం పంజాబ్‌లో 25 శాతం పైగా వ్యవసాయ భూములను కలిగి ఉన్న ఎన్ఆర్ఐలు తమ భూమిని అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం కంటే చెట్ల పెంపకం వంటి ప్రాజెక్ట్‌లకు ఉపయోగించుకోవాలని ఎన్ఆర్ఐ సభ సూచించింది.ఆ విధానం ఆర్ధికంగా రాబడితో పాటు బహుళ ప్రయోజనాలు అందిస్తుందని పేర్కొంది.
ఎన్ఆర్ఐ సభ పంజాబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స(Senior Vice President, NRI Sabha Punjab)త్నామ్ సింగ్ చానా (Tnam Singh Chana)మాట్లాడుతూ.ఎన్ఆర్ఐలు తమ మాతృభూమితో అనుబంధం ఉండాలని కోరుకుంటారని చెప్పారు.తాజాగా తాము చూపిన ప్రతిపాదనతో తమ భూములు లాక్కొంటారనే భయం ఎన్ఆర్ఐలకు ఉండదన్నారు.
వేగంగా పెరిగే జాతుల నుంచి దీర్ఘకాలం తర్వాత పక్వానికి వచ్చే జాతుల వరకు వివిధ రకాల మొక్కలను నాటడం ద్వారా ఎన్ఆర్ఐలు తమ ఆస్తులను కాపాడటంతో పాటు పంజాబ్ పర్యావరణ శ్రేయస్సుకు కూడా దోహదపడవచ్చని సత్నామ్ సింగ్ చెప్పారు.
నిజానికి పంజాబ్‌లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువ.ఇది జాతీయ సగటులో ఏడవ వంతు కంటే తక్కువ.రాష్ట్ర అటవీ విస్తీర్ణం దాని మొత్తం భౌగోళిక ప్రాంతంలో కేవలం 3.65 శాతం మాత్రమే.ఇది జాతీయ సగటు 21.76 కంటే తక్కువ.అయితే రిజర్వ్ ఫారెస్ట్, రక్షిత అడవులు, వర్గీకరించని అడవులను పరిగణనలోనికి తీసుకుంటే ఈ సంఖ్య 6.12 శాతం పైనే.