నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన తండేల్(Thandel) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉండగా ఈరోజే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కానుంది.
తండేల్ (Thandel)సినిమాను ఓన్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది.సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని భోగట్టా.
చైతన్య సాయిపల్లవిలకు(Chaitanya, Sai Pallavi) ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాపై ఈ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.తండేల్ సినిమాపై 35 కోట్ల రూపాయల భారం ఉండగా పెద్ద హీరోల సినిమాలకు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు సంక్రాంతి సీజన్ మరీ భారీ స్థాయిలో అనుకూలం అయితే కాదు.
తండేల్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

అల్లు అరవింద్ (Allu Aravind)అడ్వాన్స్ ల మీద ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారని ఇండస్ట్రీ వర్గాల టాక్.తండేల్ సినిమాలో కథ, కథనం కొత్తగా ఉంటాయని భోగట్టా.సాయిపల్లవి మంచి సినిమాలను, మంచి పాత్రలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుండటం గమనార్హం.
తండేల్ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం కష్టమేం కాదు.

తండేల్ మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.తండేల్ మూవీ నాగచైతన్య సినీ కెరీర్ కు ఎంతో కీలకమని చెప్పవచ్చు.చైతన్య భవిష్యత్తు సినిమాల బడ్జెట్లను సైతం తండేల్ మూవీ డిసైడ్ చేయనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తండేల్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.తండేల్ సినిమాకు చైతన్య 10 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.