గడపకు పసుపు కుంకుమ ఇలా పెడితే పట్టిందల్లా బంగారమే..!

మన హిందూ సాంప్రదాయంలో గడపకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.గడప అంటే లక్ష్మిదేవితో సమానము.

 Gummamiki Pasupu,kumkuma Raste-TeluguStop.com

అందువల్ల లక్ష్మిదేవికి ఇష్టమైన పసుపును గడపకు రాసి కుంకుమ బొట్టు పెడతారు.గడపను తొక్కకుండా దాటి వెళ్ళాలి.

అది ఇల్లు అయినా దేవాలయం అయినా గడపను దాటి మాత్రమే వెళ్ళాలి.ఇంటి గడపకు వారానికి ఒకసారైనా తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి.


అలాగే పర్వ దినాల్లో కూడా చేయాలి.ఇలా చేయటం వలన లక్ష్మి దేవి ఇంటిలో ఉండటమే కాకుండా దుష్ట శక్తులు అన్ని పోతాయి.ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నల్లని తాడుతో పటిక కడితే నర దిష్టి తొలగిపోతుంది.అన్ని రకాల దిష్టిలలో నర దిష్టి చాలా పవర్ ఫుల్.

నర దిష్టికి రాళ్ళూ కూడా పగులుతాయనే సామెత కూడా ఉంది.

గడప ద్వార ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి.

చీలికలు లేకుండా అఖండంగా ఉండాలి.గడప దోషంగా ఉంటే హాని కలుగుతుంది.

ఏ ఇంటికి అయినా గడపలు తప్పనిసరిపూర్వం నిర్మించిన ఇళ్లలో సింహద్వారానికి గడపలే కాకుండా ప్రతి గదికి గడపలు ఉండేవి.ఇక ఈ రోజుల్లో అయితే సింహద్వారం మరియు ఇంటి చుట్టూ ఉండే గుమ్మాలకు మాత్రమే గడపలు ఉంటున్నాయి.

అన్ని గడపలకు పసుపు రాసి కుంకుమ పెట్టకపోయినా సింహద్వారానికి ఉన్న గడపకు రాసిన సరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube