పండగలన్నింటిలోకి వినాయకచవితి జోషే వేరు.చిన్నా పెద్దా ముసలి ముతక అందరూ ఎంజాయ్ చేసే పండుగ ఏదన్నా ఉందంటే వినాయకచవితి.
పల్లెటూర్లలో ఊరివాళ్లందరిని ఒక చోటుకి చేరిస్తే.సిటీల్లో అపార్ట్మెంట్ కల్చర్ కి అలవాటు పడిన వారిని పదిరోజుల పాటు కలిసి మెలిసి ఉండేలా చేస్తుందీ పండుగ… ఈ నెల 13న దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు జరుగనున్నాయి…ఇదంతా ఒకె కానీ వినాయకుని ఆలయానికి వెళితే ఏం చేయాలో చాలామంది భక్తులకు తెలియదు.
పూజ,ప్రదక్షిణాలు,నైవేధ్యం ఇలా ప్రతిదీ ఒక్కో దేవుడికి ఒక్కో రీతిలో చేయాల్సి ఉంటుంది.అలాగే
వినాయకుని ఆలయానికి వెళితే ఏం చేయాలో తెలుసుకుందాం.
· వినాయకునికి ఆలయానికి వెళ్లేవారు ముందుగా ఆయన ముందు ప్రణమిల్లి 13 ఆత్మప్రదక్షిణాలు చేయాలి.కనీసం మూడు గుంజీలు తీయాలి.
· వినాయకుడికి 21 వెదురు పుష్పాలు కాని, కొబ్బరి పువ్వులను కానీ, వెలగ పుష్పాలను కానీ అలంకరణ కోసం సమర్పించాలి.ఇవి దొరకని పక్షంలో 21 గరిక గుచ్ఛాలను సమర్పించాలి.
· నైవేధ్యంగా చెరకు, వెలగకాయ, కొబ్బరిబోండాలను సమర్పించుకోవాలి.
· గణేశుని ఆలయం ప్రత్యేకంగా ఉంటే ఐదు ప్రదక్షిణాలు చేయాలి.
· గణేశునకు అభిషేకం అంటే ఎంతో ఇష్టం.అయితే జలంతో కన్నా కొబ్బరినీళ్ళు, చెరకురసంతో అభిషేకం చేసినట్లయితే వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి, గృహ నిర్మాణాలు చేపట్టడం వంటి సత్ఫలితాలు ఉంటాయి.
· జిల్లేడు లేదా తెల్ల జిల్లేడు పువ్వులతో గణేశుని పూజించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు.తెల్లజిల్లేడు వేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకుడికి అర్చించినట్లయితే అత్యంత శీఘ్రంగా కోరిన కోరికలు నెరవేరుతుంది.
.DEVOTIONAL