అధికమాసం లేదా పురుషోత్తమ మాసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని దాదాపు చాలామందికి తెలుసు.ఈ మాసంలో విష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి.
ఆ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.తెలుగు పంచాంగం( Telugu Panchangam ) ప్రకారం పురుషోత్తమ మాసం ముగిసేందుకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది.
ఆగస్టు 12వ తేదీన పరమ ఏకాదశి వ్రతం జరుపుకున్నారు.ఆ రోజు ను మహావిష్ణువుకి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు.
అలాగే ఆ రోజు పవిత్రమూర్తి ఆశీస్సులు పొందాలంటే ఉపవాస దీక్ష చేయాలి.

ఈ రోజు లక్ష్మీదేవి విష్ణు అనుగ్రహంతో మీకు కీర్తి సంపదలు ( Fame is riches )పెరుగుతాయి.మామూలుగా అధికమాసం ఆషాడంలో వస్తుంది.కానీ 19 సంవత్సరాల తర్వాత శ్రావణ మాసంలో వచ్చింది.
ఈ మాసాన్ని విష్ణు మాసం అని కూడా అంటారు.ఈ నేపథ్యంలో ఆగస్టు 16వ తేదీన బుధవారం రోజు ఈ మాసం ముగిసిపోతుంది.
ఈ మాసంలో శుభ ఫలితాలు పొందాలంటే మరొక మూడేళ్లు కచ్చితంగా వేచి ఉండాల్సిందే.ఈ పవిత్రమైన విష్ణు మాసంలో ప్రతి రోజు శ్రీహరిని పూజించడం వల్ల స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
అధిక మాసంలో శుక్రవారం కూడా ఎంతో ముఖ్యమైనది.ఈ రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.అమ్మవారికి తీపి పదార్థాలను లేదంటే పాయసాన్ని సమర్పించాలి.విష్ణువు ను తులసీదళాలతో పూజించాలి.
ఇలా చేయడం వల్ల దంపత్య జీవితంలో ప్రశాంతత నెలకొనడంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయి.అధికమాసం ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
అందువల్ల శుక్రవారం రోజున 11 మంది వివాహం కానీ మహిళలకు ఆహారం ఇవ్వాలి.ఆ తర్వాత వారిని మీ సామర్థ్యం మేరకు దక్షిణ కూడా ఇవ్వాలి.

ఇలా చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిరంగా ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే అధికమాసంలో తులసిని పూజించి సాయంత్రం తులసి( Basil ) ముందు నెయ్యి దీపం( Ghee lamp ) వెలిగించాలి.ఈ పని చేయడం వల్ల మీ ఇంట్లో అష్టైశ్వర్యాలతో పాటు సుఖసంతోషాలు కూడా కలుగుతాయి.