ఫన్నీగా బిల్లు చెల్లించిన కస్టమర్.. కంగుతిన్న యజమాని

ప్రస్తుతం సమాజం పురోభివృద్ధి సాధించి, ఎప్పటికప్పుడు ముందుకు దూసుకుపోతోంది.ఈ డిజిటల్ యుగంలో అందరూ టెక్నాలజీకి అలవాటు పడ్డారు.

 The Customer Who Paid The Bill Funny , Customer, Paying, Bills, Viral Latest, Ne-TeluguStop.com

ముఖ్యంగా టీ షాపు, కిరాణా దుకాణాల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అంతా చకచకా డిజిటల్ పేమెంట్లు చేసేస్తున్నారు.కరోనా వ్యాప్తి చెందాక నగదు చేతిలో ఉంచుకుని చెల్లింపులు చేయడం చాలా మంది మానేశారు.

మెజారిటీ ప్రజలు ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు.ప్రభుత్వం కూడా డిజిటల్ చెల్లింపులు దిశగా ప్రజలను ప్రోత్సహిస్తోంది.

ఇక తాజాగా ఓ వ్యక్తి వెరైటీగా పేమెంట్ చేశాడు.దేవుడికి దండం పెట్టగా బిల్లు చెల్లించినట్లు రిసిప్ట్ వచ్చింది.

దీంతో షాపింగ్ మాల్ యజమాని కంగుతిన్నాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇటీవల కాలంలో ఎవరైనా షాపింగ్‌కు వెళ్తే పర్సు మర్చిపోయామని దిగులు చెందడం లేదు.ఫోన్ ద్వారానో, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానో చెల్లింపులు చేసేస్తున్నారు.తాజాగా ఓ కస్టమర్ కొంటెతనంగా వ్యవహరించాడు.ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లి, తనకు కావాల్సినవి ఆ వ్యక్తి కొన్నాడు.బిల్లు కౌంటర్ వద్దకు వచ్చాక యజమాని అతడి ముందు బిల్లు చెల్లించే పరికరాన్ని పెట్టాడు.డెబిట్, క్రెడిట్ కార్డును స్వైప్ చేసి చెల్లిస్తాడని ఆ యజమాని భావించాడు.

అయితే అంతకు ముందే ఆ కస్టమర్ తన క్రెడిట్ కార్డును మాస్కులోపల పెట్టుకున్నాడు.కౌంటర్ వద్దకు వచ్చిన తర్వాత ఆ బిల్లు చెల్లించే యంత్రాన్ని తన ముఖం ముందు పెట్టుకుని, రెండు చేతులు పైకెత్తి దేవుడికి ప్రార్థిస్తున్నట్లు నటించాడు.

అయితే అతడికి బ్లూటూత్ కార్డు సౌకర్యం ఉండడంతో బిల్లు ఆటోమేటిక్‌గా చెల్లింపు పూర్తి అయింది.అయితే ఎటువంటి కార్డు వాడలేదని, కేవలం దేవుడికి ప్రార్థించగానే అలా జరిగిందని దుకాణ యజమాని భావించి తికమక పడ్డాడు.

కాసేపు ఏం జరిగిందో అతడికి అర్ధం కాలేదు.దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి, లో వైరల్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

దీనికి నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube