ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 05.34
సూర్యాస్తమయం:సాయంత్రం 06.32
రాహుకాలం: ఉ.01.30 నుంచి 03.00 వరకు
అమృత ఘడియలు: ఉ.07.40 నుంచి 09.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈ రోజు మీరు కొన్ని మార్పులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఇతరుల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు సహాయం చేస్తారు.వ్యాపారం విషయాల్లో ముఖ్యమైన వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.
వృషభం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీ పని విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
మిథునం:
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.ఆర్థికంగా లాభాలు పొందడానికి ఆలోచనలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గిస్తారు.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ ప్రాణస్నేహితుడిని కలుసుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో తొందర పడకూడదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
సింహం:
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మంచి ఫలితాలు అందుకుంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.
కన్య:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.
తులా:
ఈరోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొత్త పనులు ప్రారంభిస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కొన్ని పనులు ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు ఉన్నాయి.
అనవసరమైన విషయాలలో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
మకరం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.
కుంభం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య మరింత బాధపెడుతుంది.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.సంతానం నుండి శుభవార్త వింటారు.స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకూడదు.
LATEST NEWS - TELUGU