ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.04
సూర్యాస్తమయం: సాయంత్రం.6.25
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: సా.4.22 ల5.33
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
మేషం:
ఈరోజు చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేస్తారు.విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం అందదు.ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.
వృషభం:
ఈరోజు ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.
చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.దైవదర్శనాలు చేసుకుంటారు.
దూరప్రయాణ సూచనలు ఉన్నవి.వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
మిథునం:
ఈరోజు ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.వ్యాపారాలు ఆశించిన మేరకు రాణిస్తాయి.ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కర్కాటకం:
ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.మొండి బాకీలు వసూలవుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి.ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
సింహం:
ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు.శారీరక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.ఉద్యోగమున అధికారులతో వ్యతిరేఖత పెరుగుతుంది.
కన్య:
ఈరోజు మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి.నూతన రుణయత్నాలు చేస్తారు.ప్రయాణాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.
అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.పనులలో శ్రమ తప్పదు.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
తుల:
ఈరోజు అందరిలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది.దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు అనుకూలిస్తాయి.ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం:
ఈరోజు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
ధనుస్సు:
ఈరోజు ఒక విషయంలో బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి.దైవచింతన పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
మకరం:
ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కుంభం:
ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది.చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి.సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి.నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.వ్యాపారాలు నిదానిస్తాయి.ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు పరుస్తాయి.
మీనం:
ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.