సాధారణంగా చాలా మంది అమ్మాయిలకు పొడవాటి జుట్టుపై మక్కువ ఉంటుంది.ఆ మక్కువతోనే జుట్టును పొడుగ్గా మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరిలో హెయిర్ గ్రోత్( Hair growth ) అనేది సరిగ్గా ఉండదు.మీరు కూడా ఈ సమస్యను ఫేస్ చూస్తున్నారు.
అయితే అస్సలు వర్రీ అవ్వకండి.హెయిర్ గ్రోత్ ను పెంచడానికి అద్భుతమైన హెయిర్ టోనర్ ఒకటి ఉంది.
ఈ టోనర్ ను వాడటం అలవాటు చేసుకుంటే మీరు కోరుకున్నట్టే మీ జుట్టు పొడుగ్గా ఒత్తుగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ మునగాకు ( fresh munagaku )వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక గ్రైండ్ చేసుకున్న మునగాకు మరియు వన్ టేబుల్ స్పూన్ లవంగాలు ( cloves )వేసి దాదాపు పది నిమిషాల పాటు ఉడికించాలి.దాంతో మన టోనర్ అనేది రెడీ అవుతుంది.
స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి.
గోరువెచ్చగా అయ్యాక ఒక స్ప్రే బాటిల్ లో టోనర్ ను నింపుకుని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ టోనర్ ను కనుక వాడితే జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ లభిస్తుంది.
మునగాకు మరియు లవంగాలు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.జుట్టును ఒత్తుగా మరియు పొడుగ్గా మారుస్తాయి.మునగాకు మరియు లవంగాల్లో ఉండే విటమిన్లు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.జుట్టును హైడ్రేట్ గా ఉంచుతాయి.నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.అలాగే మునగాకు మరియు లవంగాల్లో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రు, పొడి స్కాల్ప్‌ను దూరంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.
సో.పొడవాటి జుట్టును కోరుకునేవారు ఇప్పుడు చెప్పుకున్న న్యాచురల్ టోనర్ ను వాడటం అస్సలు మిస్ అవ్వకండి.